మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త చిత్రం ‘భ్రమయుగం’ ప్రారంభం

Malayalam Superstar Mammootty Begins Shooting For New Horror Genre Film Bramayugam

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంభమైంది. ‘భ్రమయుగం’ అనే పేరుతో హారర్ థ్రిల్లర్ కథాంశంగా ఇది రూపొందనుంది. కేరళలోని కొచ్చిలో ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కేరళలో నిర్వహించిన వేడుకలో ఈ మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. సినిమా చిత్రీకరణ ప్రారంభం సందర్భంగా మమ్ముట్టి సహా మూవీ టీమ్ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. అందులో డార్క్ షేడ్స్ లో ఓ ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడా పట్టుకొని కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూడటానికి ఆసక్తికరంగా ఉంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు వై నాట్ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మమ్ముట్టి సోషల్ మీడియా వేదికగా దీని గురించి వివరిస్తూ.. ‘భ్రమయుగం ఒక ఉత్తేజ కరమైన చిత్రం. ఇందులో నేను మునుపెన్నడూ పోషించని పాత్రను పోషించని ఒక వైవిధ్యమైన పాత్రను ఇందులో పోషిస్తున్నందున ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దర్శకుడు రాహుల్ ప్రతిభ, నిర్మాతల అభిరుచి ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకం చేశాయి’ అని పేర్కొన్నారు. ఇక దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ.. ‘తన చిన్నప్పటి కల మమ్ముట్టి గారిని దర్శకత్వం చెయ్యాలని ఆ కల ఇప్పటికి నెరవేరింది. ‘భ్రమయుగం’ అనేది కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మమ్ముట్టి అభిమానులకు మరియు హర్రర్ జానర్ ఇష్టపడేవారికి ఇది ఒక మంచి థ్రిల్ కలిగిస్తుంది. ఈ సినిమాను అద్భుతంగా మలచడానికి నిర్మాతల సహకారం లభించినందుకు సంతోషిస్తున్నా’ అని తెలిపారు.

కాగా మమ్ముట్టి ఇప్పటికే ‘బజూకా’ అనే గేమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. డీనో డెన్నిస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ‘భ్రమయుగం’ చిత్రాన్ని ప్రారంభించడం విశేషం. మరో విశేషమేమంటే.. ప్రత్యేకంగా హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసమే నిర్మాత చక్రవర్తి రామచంద్ర ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం. ఈ బ్యానర్ పై నిర్మిస్తున్న తొలిసినిమా ఇదే కావడం గమనార్హం. కాగా 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ ‘భ్రమయుగం’ సినిమాలో షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా, షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్ తదితరులు ఇతర కీలక పాతల్రు పోషిస్తున్నారు. కాగా ఈ ఏడాది తెలుగులో అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాలో మమ్ముట్టి ఒక కీలక పాత్ర పోషించిన విషయం సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 6 =