మహేష్ బాబు పెట్ డాగ్ మృతి.. నమ్రత, సితార భావోద్వేగం

Mahesh Babu's Pet Dog Pluto Passed Away, Namrata and Sitara Gets Emotional

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పెంపుడు కుక్క మరణించింది. వారికి గల కుక్కల్లో ప్లూటో అనే పేరు కలిగిన ఈ కుక్క తాజాగా చనిపోయింది. దీంతో మహేష్ కుటుంబ సభ్యులు విచారంలో మునిగిపోయారు. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ మరియు కుమార్తె సితార సోషల్ మీడియా వేదికగా ఆ కుక్కతో తమకు గల అనుబంధాన్ని వెల్లడించారు. భావోద్వేగ పోస్టులతో ప్లూటోను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్లూటోని చాలా మిస్ అవుతున్నాం అంటూ ఒక పోస్టును పెట్టారు. ఆమె దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే, వారి కుమార్తె సితార కూడా ప్లూటో మృతికి హృదయపూర్వక నివాళిని పంచుకున్నారు. ‘గత ఏడేళ్లుగా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నిన్ను చాలా మిస్ అవుతున్నాను’ అంటూ ప్లూటో ఫోటోని షేర్ చేసింది. అలాగే హీరో మహేష్ బాబు కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్లూటోతో తను ఆడుకుంటున్న పాత ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో ప్లూటోకు మహేష్ ఫామిలీతో ఎంత బాండింగ్ ఉండేదో అందరికి అర్ధమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

 

View this post on Instagram

 

A post shared by sitara 🪩 (@sitaraghattamaneni)

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

కాగా ప్రస్తుతం మహేష్ బాబు కొన్నిరోజుల విరామం తర్వాత ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో రెండు భారీ సెట్స్‌ వేసినట్టు ఫిలింనగర్‌ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ నేతృత్వంలో ఈ సెట్స్‌ నిర్మించినట్లు తెలుస్తోంది. ఎస్‌ఎస్‌ఎంబీ 28గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా ఇందులో మహేష్ సరసన మీనాక్షి చౌదరి మరియు టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ‘గుంటూరు కారం’ సినిమా 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =