నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా ‘స్వయంభూ’ షూటింగ్ ప్రారంభం

Nikhil Siddhartha's New Movie Swayambhu Shooting Begins

టాలీవుడ్ యంగ్ హీరోలలో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న వారిలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. నిఖిల్ స్క్రిప్ట్‌ సెలక్షన్‌ చూసి స్టార్స్ కూడా ఆశ్చర్యపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే కార్తికేయ-2 సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో మార్కెట్‌ ఏర్పరుచుకున్నాడు. దీంతో నిఖిల్ తన తదుపరి సినిమాలన్నీ పాన్‌ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ‘స్పై’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా నార్త్ ఇండియాలో భారీ ఓపెనింగ్స్‌ రాబట్టడం గమనార్హం. ఈ క్రమంలో మరో రెండు సాలిడ్ హిట్లు పడితే నిఖిల్ అగ్ర హీరోల లిస్టులో చేరిపోతాడని సినీ ఎనలిస్టుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో నేడు (గురువారం, ఆగస్టు 18, 2023) నిఖిల్ కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీ, ఏషియన్ సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాస్ రావు, శరత్ మరార్ సహా పలువురు హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘స్వయంభూ’ పేరుతో సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా భరత్ కు ఇంతకుముందు తమిళంలో పలు సినిమాలకు రైటర్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈరోజు సినిమా షూటింగ్‌ ప్రారంభం సందర్భంగా.. మేకర్స్ సినిమాకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గుర్రంపై యుద్ద వీరుడి గెటప్‌లో ఉన్న నిఖిల్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఎదురుగా ఒక పెద్ద డ్రాగన్‌ నోటి నుంచి మంటలు వెదజల్లుతుండగా.. నిఖిల్ బాణం ఎక్కుపెట్టిన స్టిల్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఈ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. ఇక ఈ పీరియాడిక్‌ డ్రామా సినిమాకు రవి బస్రూర్‌, రామకృష్ణ పరమహంస వంటి స్టార్‌ టెక్నిషన్‌లు పనిచేస్తున్నారు. అలాగే నిఖిల్ సరసన టాలీవుడ్‌ లక్కి గర్ల్‌ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘స్వయంభూ’ సినిమాను పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ మరియు శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు నిఖిల్‌ ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా ‘ది ఇండియన్‌ హౌజ్‌’ అనే ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు కార్తికేయ సిరీస్‌లో భాగంగా మూడో పార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + five =