మొదటి సినిమా ఉప్పెన తో హీరో గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఆ తరువాత కొండపొలం,రంగ రంగ వైభవం తో అదే జోరును కొనసాగించలేకపోయాడు.ఇక ఇప్పుడు ఈ హీరో ఆదికేశవ తో రానున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను ఈనెల 18న విడుదల చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ పూర్తి కాకపోయేసరికి వాయిదా వేశారు.ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.నవంబర్ 10న థియేటర్లలోకి రానుందని సినిమా నుండి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి తెలియజేశారు.ఈపోస్టర్ లో వైష్ణవ్ తేజ్,హీరోయిన్ శ్రీ లీల రొమాంటిక్ పోజ్ లో కనిపించారు.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని అంచనాలను పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Certain stories are worth the anticipation and time! 🔥#Aadikeshava will arrive in theaters from November 10, 2023! 🤩#AadikeshavaOnNov10th 💥#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy @NavinNooli @dudlyraj @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/LlLPcZzFJD
— Sithara Entertainments (@SitharaEnts) August 18, 2023
త్వరలోనే ఈసినిమానుండి మొదటి పాటను విడుదలచేయనున్నారు.ఇటీవలే ఈసినిమా పారిస్ లో షూటింగ్ ముగించుకుంది.దాంతో షూటింగ్ తుది దశకు చేరుకుంది.శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతంఅందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ 4సినిమాస్,శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల ఫై నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మరి ఈసినిమాతో హిట్ కొట్టి వైష్ణవ్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: