నల్గొండ జిల్లా పర్యటనలో అల్లు అర్జున్.. గజమాలతో స్వాగతం పలికిన ఫ్యాన్స్

Icon Star Allu Arjun Hungama In Nalgonda

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ శనివారం నల్గొండ జిల్లాలో సందడి చేశారు. ఒక్కరోజు పర్యటనకు విచ్చేసిన ఆయన జిల్లాలోని పెద్దవూర మండలం, బట్టు గూడెం గ్రామంలో తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారన్న సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై అల్లు అర్జున్‌కు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం దారి పొడవునా బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుట్టిన ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో తన మామ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, ఇలాంటివి నిర్వహిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలని అన్నారు. ఇక తనపై ఇంతటి ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలని, తాను కూడా వారిని ప్రేమిస్తూనే ఉంటానని తెలిపారు. కాగా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌ రెడ్డి భట్టుగూడెం వద్ద ‘కంచర్ల కన్వెన్షన్‌’ పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ఆయన ఎప్పటినుంచో పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే 1000 మందికి సరిపడేలా అత్యాధునిక వసతులతో కూడిన ఒక ఫంక్షన్‌ హాల్‌ను నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి తన అల్లుడైన హీరో అల్లు అర్జున్‌ తో పాటుగా జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి భోజనాలతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అయితే రాజకీయాలపై ఆసక్తి ఉన్న చంద్రశేఖర్‌ రెడ్డి 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి దాదాపు 25 వేల ఓట్లు పొందారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తన స్వస్థలమైన నాగార్జున సాగర్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 3 =