షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి సెన్సార్ పూర్తి, యూ/ఏ సర్టిఫికెట్ జారీ

Shah Rukh Khan's Jawan Movie Gets UA Certificate

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా ‘జవాన్‌’. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్‌ సరసన సౌత్ ఫిమేల్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ప్రియమణి, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి షారుఖ్ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్ నిర్మాత కాగా.. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 7న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై ఓ రేంజిలో అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వివిధ గెటప్పుల్లో బాద్‌షాను చూసి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘దుమ్ము దులిపేలా’, ‘ఛలోనా’ అనే పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘పఠాన్‘ వంటి సాలిడ్ హిట్ తర్వాత షారుఖ్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. అటు మేకర్స్ సైతం ఈ చిత్రానికి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మరో బిగ్ అప్‌డేట్ వెల్లడించింది. ‘జవాన్’ చిత్రం ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించినట్లు ఎనౌన్స్ చేశారు.

అయితే తొలుత ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు మొత్తం ఏడు చోట్ల కట్స్ చెప్పినట్టుగా తెలిసింది. అలాగే కొన్ని పదాలను తీసెయ్యమన్నారని, మరికొన్నింటిని వేరే పదాలతో రీప్లేస్ చేయమన్నారని సమాచారం. సినిమాలో ‘రాష్ట్రపతి’ అని వచ్చిన సందర్భంలో దానికి బదులుగా ‘హెడ్ అఫ్ ది స్టేట్’ అని మార్చమని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనితోపాటుగా సినిమాలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) అని ఎక్కడ వచ్చినా తీసెయ్యమన్నారని, దీనిని ఐ.ఐ.ఎస్.జి (IISG) అని మార్చారని సమాచారం. మూవీ యూనిట్ ఇవన్నీ చేంజ్ చేసి తీసుకువచ్చాక, సెన్సార్ బోర్డు ‘జవాన్’ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ తో క్లియరెన్స్ ఇచ్చిన్నట్టుగా తెలిసింది. కాగా ఈ మొత్తం మార్పులు అన్నీ చేసాక సినిమా నిడివి సుమారు 169 నిముషాలుగా వచ్చిందని తెలిసింది. అంటే ‘జవాన్’ రెండు గంటల 49 నిముషాలు నిడివి ఉండనుంది.

ఇదిలా ఉండగా.. ‘జవాన్’ కోసం పవర్ హౌసెస్ లాంటి 6 గురు యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం గమనార్హం. స్పైరో రజటోస్, యాన్నిక్ బెన్, క్రెయిన్ మ్యాక్రే, కెచా ఖంఫ్కాడె, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు వంటి యాకన్ కొరియోగ్రాఫర్స్ ‘జవాన్’ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేయటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పైన పేర్కొన్న యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ప్రపంచంలో ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు వర్క్ చేశారు. జవాన్ లో భారీ యాకన్ సన్నివేశాలున్నాయి. ఇవన్నీ కథలో భాగంగా ఉంటూనే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించనున్నాయి. సాధారణంగా సినిమాకు ఒక యాక్షన్ డైరెక్టర్ సన్నివేశాలను డిజైన్ చేస్తేనే ఆశ్చర్యపోతుంటాం. అలాంటిది ఈ సినిమాకు ఏకంగా ఆరుగురు అత్యుత్తమ యాక్షన్ మాస్టర్స్ వర్క్ చేశారంటే.. స్టంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.