మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌లపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vijay Deverakonda Interesting Comments on Megastar Chiranjeevi and Superstar Rajinikanth

టాలీవుడ్ నటులలో యూత్‌లో మాంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఆయన సినిమాలు చూసి అభిమానులైన వారికంటే తన యాటిట్యూడ్ చూసి అభిమానులైనవారే ఎక్కువగా ఉంటారు. కార్యక్రమం ఏదైనా.. సందర్భం ఏదైనా.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించడానికి విజయ్ ఎప్పుడూ వెనుకాడరు. తాజాగా ఆయన మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌లను ఉద్దేశించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరూ సూపర్ స్టార్స్ అని, వాళ్ళకి జయం, అపజయం అనేవి చాలా సాధారణ పదాలని పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రెండింటికన్నా ఇంకా ఎక్కువని చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. సమంతతో కలిసి విజయ్ చేసిన కొత్త సినిమా ‘ఖుషి’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చెన్నైలో మూవీ టీమ్ పర్యటించింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో తెలుగు అగ్ర నటులకు సంబంధించి అక్కడి మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు సంధించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆయా ప్రశ్నలకు సమాధానంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తెలుగు, తమిళ భాషల్లోని అగ్రనటులు అందరూ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతున్నారని ప్రశంసించారు. ఈ క్రమంలో వారికి ఒకవేళ అపజయం ఎదురైనా వెనక్కి తగ్గడం లేదని, మరో ప్రయత్నంతో సక్సెస్ అందుకుంటున్నారని తెలిపారు. ఇటీవలే కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో, రజినీకాంత్ ‘జైలర్’తో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారని అన్నారు. చిరంజీవి, రజినీకాంత్ లాంటివాళ్ళకి ఇలాంటి అపజయాలు వరసగా ఆరేడు వచ్చినా వాళ్ళు మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర తమ ప్రతాపం చూపిస్తారని చెప్పిన విజయ్ దేవరకొండ.. సూపర్‌స్టార్‌ రజినీకాంత్ వరసగా ఆరు ప్లాప్ లు ఇచ్చినా, ‘జైలర్’ సినిమాతో ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.500 కోట్లు కలెక్టు చేసే హిట్ ఇచ్చారని, అందుకే వాళ్ళకి హిట్, ఫ్లాప్ ఇలాంటివి ఏవీ ఉండవని అన్నారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. తాజాగా విడుదలైన చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేకపోవడంతో సాంఘీక మాధ్యమాల్లో దీనిపై విమర్శలు చేస్తున్నారని, అలాంటివారు అంతకుముందు ‘వాల్తేరు వీరయ్య’తో మెగాస్టార్ భారీ విజయం సాధించారని గుర్తుంచుకోవాలని కోరారు. అసలు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని కొన్ని వేలమంది ఇండస్ట్రీకి వచ్చారని, సరైన కథ, దర్శకుడు కుదిరితే ఆయన తన సత్తా ఏంటో చూపిస్తారని చెప్పారు. చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చారని, అప్పటివరకు వుండే డాన్సులు చిరంజీవి వచ్చాక మారాయని గుర్తు చేశారు. అలాగే ఫైట్స్, పాటలు ఒకటేమిటి ఇలా ఎన్నో చిరంజీవి తనదైన స్టయిల్ లో మార్పులు చేశారని తెలిపారు. చిరంజీవి వచ్చిన తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకోలా ఉందని, అంతలా ప్రభావం చూపించారని కొనియాడారు. మెగాస్టార్, సూపర్‌స్టార్‌లపై విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇరువురు అగ్ర హీరోల అభిమానులు విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఆయన ఇంతకుముందు ‘నిన్ను కోరి’ మరియు ‘మజిలీ’ సినిమాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన మూవీ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో మూవీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇలాంటి మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఈ సినిమాలోని పాటలను సింగర్స్ లైవ్ లో పాడారు. అలాగే ఇందులోని ఒక పాటకి విజయ్ దేవరకొండ, సమంత కలిసి డాన్స్ చేయడం విశేషం. దీంతో కార్యక్రమానికి వచ్చిన అభిమానుల కేరింతలతో ఆడిటోరియం హోరెత్తింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 6 =