వెన్నెల కిశోర్ హీరోగా యాక్షన్ కామెడీ సినిమా చారి 111

Vennela Kishore as Hero in New Movie Chaari 111

వినోదానికి కేరాఫ్ అడ్రస్ ‘వెన్నెల’ కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు.. వినోదంలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నారు. గత కొంతకాలంగా తెలుగు సినిమాలలో వెన్నెల కిశోర్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి లేదు. అయితే ఆయన హాస్య నటుడిగా మాత్రమే కాదు, కథానాయకుడిగానూ తనకు సూటయ్యే క్యారెక్టర్లు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్ కథానాయకుడిగా ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది. వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘చారి 111’. ఆయన కథానాయకుడిగా బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో వెన్నెల కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈరోజు సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు. ఇక విడుదలైన టీజర్‌లో.. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం వచ్చి పడుతుంది. దానిని ఎదిరించడం కోసం మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ) వస్తారు. అయితే అసలు, ఆ సమస్య ఏమిటి? విలన్ ఎవరు? అనేది వెల్లడించలేదు. కానీ, హీరో క్యారెక్టర్ ఏమిటనేది చాలా క్లారిటీగా చూపించారు. కన్‌ఫ్యూజ్డ్ స్పై పాత్రలో వెన్నెల కిశోర్ ప్రేక్షకులకు మరోసారి ఫుల్‌గా వినోదం అందించనున్నారని అర్ధమవుతోంది. ఈషా పాత్రలో హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్, మహి పాత్రలో ప్రియా మాలిక్ నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే హీరోయిన్ ఫైట్స్ చేయనున్నట్లు చూపించారు.

ఈ సందర్భంగా ‘చారి 111’ గురించి చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ.. ”ఇదొక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో ‘వెన్నెల’ కిశోర్ గూఢచారి (స్పై) పాత్రలో కనిపిస్తారు. ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్ స్టైలిష్‌గా ఉంటుంది. అలాగే, ఆ పాత్రలో ఓ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అది ఏమిటి? గూఢచారి ఏం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ ప్రేక్షకుడిని మా సినిమా అలరిస్తుంది” అని చెప్పారు.

అలాగే చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ.. ”స్పై జానర్ సినిమాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. కథలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. అందులో విలన్ రోల్ ఒకటి. అయితే విలన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పటి వరకు చిత్రీకరణ చేసిన సన్నివేశాలు మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి. ‘చారి 111’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది” అని చెప్పారు.

కాగా వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో.. మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రిచర్డ్ కెవిన్ ఎ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. కరుణాకర్ స్టంట్స్ రూపొందిస్తున్నారు. ఇక అక్షత బి హొసూరు ప్రొడక్షన్ డిజైన్ చేస్తుండగా.. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్య సహకారం అందిస్తున్నారు. కషిష్ గ్రోవర్ సినిమాటోగ్రాఫర్ గా.. సైమన్ కె కింగ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ సినిమాను బర్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై అదితి సోనీ నిర్మిస్తుండగా.. టీజీ కీర్తీ కుమార్ రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలియజేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 2 =