భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ‘చంద్రయాన్ 3’ మిషన్ సూపర్ సక్సెస్ అయింది. తద్వారా రోదసిలో ఇప్పటివరకు మరే దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై ‘ఇస్రో’ విక్రమ్ ల్యాండర్‌ను దించింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి తొలి చంద్రుడి తొలి ఫోటోను పంపించింది. కాగా ఇప్పటివరకూ చంద్రునిపైకి అమెరికా, రష్యా, చైనా మాత్రమే రోవర్లను పంపాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో చంద్రుడిపై అంతరిక్ష పరిశోధన మాడ్యూల్‌ను సురక్షితంగా దింపిన నాలుగో దేశంగా అవతరించింది. అయితే, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే..? పై మూడు దేశాల్లో ఏ ఒక్కటీ చంద్రుడి దక్షిణ ధ్రవ ప్రాంతంలో దిగలేదు. తాజా ప్రయోగంతో మొట్టమొదటిసారి ఇండియానే ఆ ఘనత సొంతం చేసుకుంది. ఈ శుభ సందర్భంలో దేశం సంబరాల్లో మునిగిపోయింది. ఇక ‘చంద్రయాన్ 3’ మిషన్ విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశంలోని అన్ని రంగాల ప్రముఖులు ‘ఇస్రో’ను వేనోళ్ళ కొనియాడుతున్నారు.
ఈ క్రమంలో ఈ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా ‘చంద్రయాన్ 3’ మిషన్ సక్సెస్‌పై స్పందించింది. టాలీవుడ్ లోని అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రవితేజ మరియు అక్కినేని నాగార్జున తదితరులు ‘ఇస్రో’కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని, 130 కోట్ల మంది భారతీయులు తమ భావితరాలకు సగర్వంగా చెప్పుకునేలా చేసిందని పేర్కొన్నారు. అలాగే ‘చంద్రయాన్ 3’ ప్రయోగంతో విక్రమ్ లాండర్ చందమామపై కాలిడిటం అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయపరంపరలో ఒక ముఖ్య ఘట్టమని, ఈ అద్భుత విజయానికి కారకులైన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాభినందనలు అని తెలిపారు.
An absolutely Momentous achievement for India !! #Chandrayaan3 🚀 registers an unprecedented and spectacular success!!! 👏👏👏
History is Made today!! 👏👏👏
I join over a Billion proud Indians in celebrating and congratulating our Indian scientific community !!
This clearly… pic.twitter.com/tALCJWM0HU— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2023
A golden chapter in our space history!
* Congratulations to @isro scientists
हमारे अंतरिक्ष इतिहास में एक स्वर्णिम अध्याय
– JanaSena Chief Shri @PawanKalyan@narendramodi @BJP4India#Chandrayaan3 #Chandrayaan3Landing
#Isro #India pic.twitter.com/4oPJ4Sr8mH— JanaSena Party (@JanaSenaParty) August 23, 2023
A triumphant journey to the Moon’s south pole! #Chandrayaan3‘s graceful landing is a testament to India’s scientific excellence and a giant leap in space exploration! Sky is no longer the limit!! Congratulations team @isro!! 🇮🇳 #IndiaOnTheMoon
— Mahesh Babu (@urstrulyMahesh) August 23, 2023
My heartiest congratulations to @ISRO on a successful soft landing of #Chandrayaan3 mission on the surface of the moon. As always, you are the pride of India.
— Jr NTR (@tarak9999) August 23, 2023
Mission Accomplished! 🇮🇳Chandrayaan’s touchdown on the moon is a remarkable achievement for India’s space program. Congratulations to ISRO for their exceptional work and for taking us closer to the cosmos! #ISRO #Chandrayaan3 #JaiHind pic.twitter.com/EqTwPMq6SQ
— Ram Charan (@AlwaysRamCharan) August 24, 2023
Congratulations to @ISRO for scripting another glorious chapter in India’s space journey with the successful soft landing of #Chandrayaan3 🌕
Your brilliance and tireless efforts shine as a beacon of hope and pride for our nation 🇮🇳🚀 pic.twitter.com/PI79Rh5Stk
— Ravi Teja (@RaviTeja_offl) August 23, 2023
Congratulations india!!#Chandrayaan3 we are on the moon💐💐💐
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 23, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























