మెగాస్టార్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. త్వరలో శంకర్ దాదా MBBS రీ రిలీజ్

Megastar Chiranjeevi's Shankar Dada MBBS Movie Ready For Re Release

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోల పుట్టిన రోజు సందర్భంగా ఒకప్పటి హిట్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘పోకిరి’ నుంచి మొదలైన ఈ ట్రెండ్.. ఆ తర్వాత ఇండస్ట్రీలోని ఇతర టాప్ హీరోల సినిమాల రీ రిలీజ్‌లతో ఊపందుకుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజై భారీ కలెక్షన్స్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే విచిత్రంగా గతంలో అంతగా విజయం సాధించని సినిమాలు కూడా రీ రిలీజ్‌లో నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘యోగి’ సినిమాను రీసెంట్‌గా రీ రిలీజ్ చేయగా..  విడుదలైనప్పటికంటే ఇప్పుడే ఎక్కువ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక త్వరలోనే మరికొన్ని సినిమాలు కూడా రీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ కోవలోనే మరో సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్‌ కానుంది. అయితే అది మెగాస్టార్ సినిమా కావడం విశేషం. నేడు చిరంజీవి జన్మదినం సందర్భంగా.. ఫ్యాన్స్‌కు శుభవార్త అందింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ‘శంకర్ దాదా MBBS’ రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. త్వరలో ఈ సూపర్ హిట్ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ‘జెమిని ఫిల్మ్ సర్క్యూట్’ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.

కాగా బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్ హీరోగా హిందీలో వచ్చిన ‘మున్నాభాయ్ MBBS’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెలుగులో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో మెగాస్టార్ నటన, ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ ఆడియన్స్‌ను విశేషంగా అలరించాయి. అలాగే హీరో శ్రీకాంత్ ఏటీఎం పాత్రలో కనిపించి సందడి చేయడం విశేషం. అయితే త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. దీంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు ఈ ఏడాది చివరిలోగా మరికొన్ని ఇతర హీరోల సినిమాలు రీ రిలీజ్ కానున్నాయని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.