రవితేజ ‘ఈగల్’ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

Ravi Teja Starring Eagle Movie Concept Poster Unveiled

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ చేస్తుండగా.. కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘ఈగల్’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇటీవలే ‘ఈగల్’ టీజర్‌ను విడుదల చేయగా.. దీనికి ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. ఈ టీజర్ నేషనల్ వైడ్‌గా వైరల్ అయ్యింది. ఇందులో మాస్ మహారాజా డిఫరెంట్ గెటప్స్, షేడ్స్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రజెన్స్‌తో అద్భుతంగా ఆలరించారు. ఇక దీపావళి సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్‌ ఇచ్చారు. దీపాల పండుగని పురస్కరించుకొని ‘ఈగల్’ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేశారు. కాగా ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూడటానికి చాలా వైవిధ్యంగా, ఆసక్తికరంగా వుంది. ఆ పోస్టర్‌లో హీరో రవితేజ అప్పిరియన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. పోస్టర్ కాన్సెప్ట్ సినిమా టైటిల్ ‘ఈగల్’ని జస్టిఫికేట్ చేస్తోంది.

ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతోందనడంలో సందేహం లేదు. ఇక టాలీవుడ్‌లోని అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్‌లలో ఒకరైన కార్తీక్ ఘట్టమనేని తన అద్భుతమైన టేకింగ్‌తో డైరెక్షన్‌లో తన నైపుణ్యాన్ని చూపించారు. ప్రిమైజ్, నెరేటివ్ ప్రామెసింగ్ గా వున్నాయి. కార్తీక్, కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లాతో కలిసి క్యాప్చర్ చేసిన కెమెరా బ్లాక్‌లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. డేవ్ జాంద్ చేసిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల మాస్టర్ వర్క్ ఆకట్టుకుంది. ఇక ‘కార్తికేయ2’ కి సంభాషణలు సమకూర్చిన మణిబాబు కరణం మాటలు అందిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 13న ఈగల్ అన్ని దక్షిణ భారత భాషల్లో, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 11 =