విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌

Vijay Deverakonda's Family Star First Single to be Out Very Soon

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ తర్వాత రీసెంట్‌గా చేస్తోన్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. అగ్ర నిర్మాత దిల్ రాజు సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా న‌టిస్తుంది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరశురాం కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్‌ ఏర్పడింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘టైటిల్‌ లుక్‌ను రివీల్ చేస్తూ.. లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు టీజ‌ర్‌లకు నెట్టింట మంచి అప్లాజ్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా ఈ టీజ‌ర్‌లో విజ‌య్ దేవరకొండ ‘ఐరనే వంచాలా ఏంటి?’ అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో “ఏం నడుస్తోంది?” అనే ప్రశ్నకు సమాధానంగా.. ఈ డైలాగ్ నడుస్తోంది అని నెటిజెన్లు అంటున్నారు. దీనికి సంబంధించి పలు మీమ్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు. ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతోందని అనౌన్స్‌ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో దీనిని ఖరారు చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది.

ఆ పోస్టర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ, మృణాళ్ ఠాకూర్ సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఇంటిచుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించి ఉండగా.. వారిద్దరూ కలిసి చిచ్చుబుడ్డి వెలిగిస్తున్నారు. ఈ దృశ్యం చూడటానికి అద్భుతంగా ఉంది. విజ‌య్, మృణాళ్ జంట మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కాగా ‘లైగర్’ వంటి డిజాస్టర్ తర్వాత విజయ్‌ ‘ఖుషి’ సినిమాతో ఇటీవలే హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు మృణాళ్ కూడా ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు నేచురల్ స్టార్ నానితో ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది. ఇక కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =