చంద్రమోహన్ మృతి.. భావోద్వేగానికి గురైన కమల్ హాసన్

Kamal Haasan Shares Emotional Post on Actor Chandra Mohan Demise

ప్రముఖ టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రమోహన్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రమోహన్ మృతికి సంతాపం తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రవితేజ, వరుణ్ తేజ్, గోపీచంద్, నాని, రామ్ పోతినేని, మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ సహా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, బాబీ మరియు హరీష్ శంకర్ తదితరులు ఎక్స్ లో సీనియర్ నటుడికి ఘన నివాళి అర్పించారు. కాగా చంద్రమోహన్‌కి భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం (నవంబర్ 13, 2023) హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించారు.

ఇక ఇదిలా ఉంటే.. చంద్రమోహన్ మృతిపై ప్రముఖ తమిళ్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తమిళంలో రాసిన ఒక భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో ఆయన ఇలా తెలిపారు.. “తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు, నా ఆత్మ మిత్రుడు చంద్రమోహన్ కన్నుమూశారు. నాకు 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఇద్దరం ఒకేసారి కెరీర్ ప్రారంభించాము. చంద్రమోహన్‌కి నృత్యం నేర్పించమని తంగపన్‌ మాస్టర్‌ నన్ను నియమించారు. చంద్రమోహన్ తమిళంలో ప్రధాన పాత్రలో నటించిన చిత్రానికి డబ్బింగ్ చెప్పమని ఏవీఎం కోరింది. అప్పటి వరకు డ్యాన్స్ అసిస్టెంట్‌గా ఉన్న నాకు ఇది కొత్త అవకాశం. అలా మొదలైన మా ప్రయాణం.. కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది” అని తెలిపారు.

ఇంకా కమల్ హాసన్ ఇలా చెప్పారు.. “తమిళంలో ఘనవిజయం సాధించిన నేను నటించిన ’16 వయత్తినిలే’ తెలుగు రీమేక్‌ ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంలో చంద్రమోహన్‌ నా పాత్రను పోషించారు. మా ఇద్దరికీ ఉమ్మడిగా ఉండే ఆసక్తులలో ప్రధానమైనది ఆహారం. జీవితాన్ని పరిపూర్ణంగా జీవించగలిగిన అతికొద్దిమందిలో చంద్రమోహన్ తప్పకుండా ఉంటారు. ఆయన గొప్ప నటుడే కాదు, అంతకన్నా బాగా జీవించే కళ తెలిసిన నిపుణుడు. సరికొత్తగా నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే నిత్య విద్యార్థి. తనతో పాటు తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడమెలాగో అతనికి బాగా తెలుసు. నా ప్రియా మిత్రుడు కన్నుమూశారు. ఈ క్షణంలో అతని జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. వెళ్లి రా.. నా ప్రియతమా!” అని పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =