మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ నుండి మరో సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇంతకుముందు ఈసినిమా నుండి మొదటి పాట టిక్కెట్టే కొనకుండా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఇప్పుడు రెండో పాటను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.సాంగ్ కూడా రెడీ అయిపోయిందట.త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ కానుంది.ఈసందర్భంగా సినిమా నుండి సిద్దు పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ అప్డేట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing you all a very #HappyDiwali 🎆 – Team #TilluSquare 😎
A MASSY 2nd single is on its way, Get your dancing shoes ready! 👟🕺
In cinemas #TilluSquareOnFeb9th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/UXHpQaC2Wn
— Sithara Entertainments (@SitharaEnts) November 12, 2023
ఇక గత ఏడాది వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.చిన్న సినిమాగా వచ్చి కాసుల వర్షం కురిపించింది.దాంతో సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ ఫై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో నటిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.రామ్ మిర్యాల సంగీతం అందిస్తుండగా సాయి సౌజన్య,నాగవంశీ నిర్మిస్తున్నారు.
సినిమా విజయంపై నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.డీజే టిల్లు కన్నా టిల్లు స్క్వేర్ మరింతగా ఎంటర్టైన్ చేస్తుందని రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు.ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: