
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 24


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

విశాల్ 34 టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

భగవంత్ కేసరి- అనిల్ కు మేకర్స్ కాస్ట్లీ గిఫ్ట్

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్

యానిమల్ అప్పుడే లక్ష టికెట్లు సోల్డ్

ఈ ఏడాది ఇదే బెస్ట్ ఫిల్మ్ - సమంత

నవదీప్ లవ్ మౌళి టీజర్ రిలీజ్

యానిమల్- రణ్ బీర్ వాడిన 500 కేజీల గన్ రియల్

కాంతార చాఫ్టర్ -1 టీజర్ రిలీజ్

గీతాంజలి మళ్లీ వచ్చింది.. షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్

మట్కా కోసం వరుణ్ ప్రిపరేషన్

రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ గ్రాండ్ లాంచ్
స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార, సమంత ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉండగా వారితో పాటు కీర్తి సురేష్ ఇంకా పలువురు హీరోయిన్లు ఇప్పటికే లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేయగా.. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఆలిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికే రెయిన్ బో సినిమాను లైన్ లో పెట్టాడు. తాజాగా మరో సినిమా లాంచ్ అయింది.

మహేష్ బాబుతో ప్లాన్ చేసింది యానిమల్ కాదు, డెవిల్ - సందీప్ వంగా
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' సినిమాను రూపొందించి తొలిప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఆ ఒక్క మూవీతో ఏకంగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అదే సినిమాను షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి అక్కడా సాలిడ్ హిట్ కొట్టాడు. దీంతో దేశవ్యాప్తంగా సందీప్ పేరు మారుమోగిపోయింది. స్టార్ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో సందీప్ తన మూడో సినిమాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ టైటిల్ రోల్‌లో 'యానిమల్' సినిమాను తెరకెక్కించాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
యంగ్ హీరో విశ్వక్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే దాస్ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి సుట్టంలా సూసి పోకలా అనే పాటను రిలీజ్ చేయగా ఆ పాట ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుందో చూశాం.

హాయ్ నాన్న- ఓడియమ్మ పార్టీ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక ఈసారి తన జోనర్ ను పూర్తిగా మార్చేసి లవ్ ప్లస్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఈసినిమా వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని అయితే పెంచేశాయి. ఈసినిమా ట్రైలర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ ఫుల్ ఎషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిందని చెప్పొచ్చు. తల్లికి దూరం అయిన కూతురుని తండ్రి ఎలా పెంచాడు, తన గతం ఏంటి, వాళ్ళ లైఫ్ లోకి మృణాల్ ఎంటర్ అయిన తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా కథ. ట్రైలర్ తో సినిమాపై అంచనాలను అయితే మరింత పెంచేశారు.

విశాల్ 34 టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు విశాల్. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇక చాలా రోజులు తరువాత తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా టైటిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ షాట్ ను డిసెంబర్ 1వతేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

నెక్స్ట్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన దసరా డైరెక్టర్
నానితో దసరా తీసి బ్లాక్ బాస్టర్ హిట్ తో డైరెక్టర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల.మొదటి సినిమాతోనే 100కోట్ల హిట్ ఇచ్చాడుఈ డైరెక్టర్.అంతేకాదు ఓ స్టార్ హీరో ను అప్పటివరకు చూడని ఊర మాస్ అవతారంలో చూపించి సినిమాను బాగా హ్యాండిల్ చేశాడని పేరు తెచ్చుకున్నాడు.ఇక ఈసినిమా తరువాత శ్రీకాంత్ ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు.మధ్యలో ప్రభాస్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి.అంతేకాదు రామ్ చరణ్ కోసం ఓ స్క్రిప్ట్ చేస్తున్నాడని కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే వాటి విషయంలో క్లారిటీ రాలేదు.ఇక తాజాగా ఈ వార్తలఫై స్పందించాడు శ్రీకాంత్.

భగవంత్ కేసరి- అనిల్ కు మేకర్స్ కాస్ట్లీ గిఫ్ట్
వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ…

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్
జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈమధ్య కాలంలో నితిన్ సరైన విజయం సాధించలేకపోయాడు. ఎప్పటినుండో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.

యానిమల్ అప్పుడే లక్ష టికెట్లు సోల్డ్
ట్రైలర్ తో ఒక్కసారిగా ఎక్కడాలేని బజ్ తెచ్చుకుంది యానిమల్.రణబీర్ కపూర్ హీరోగా నటించగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశాడు.ఈసినిమాకు హిందీలో ఎంత క్రేజ్ వుందో తెలుగులో కూడా అంతే హైప్ వచ్చింది.ఈరోజు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగనుంది.దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబుతోపాటు స్టార్ డైరెక్టర్ రాజమౌళి అతిథిలుగా రానున్నారు దాంతో సినిమాకున్న క్రేజ్ మరింత పెరిగింది.వీరిద్దరు సినిమా గురించి ఏం మాట్లాడుతారని ఆసక్తిగా మారింది.

టిల్లు స్క్వేర్- రాధిక ఫుల్ సాంగ్ రిలీజ్
సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమా ఫిబ్రవరి 9కు వెళ్లింది.

ఈ ఏడాది ఇదే బెస్ట్ ఫిల్మ్ - సమంత
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల పరంగా కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె షూటింగులకు విరామం ప్రకటించి చికిత్స తీసుకుంటున్నారు. అయితే సినిమాలకు విరామం ఇచ్చినా.. సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గానే ఉంటోంది. ఈ క్రమంలో సమంత తాజాగా విడుదలైన ఒక సినిమా గురించి రివ్యూ ఇచ్చింది. ఈ ఏడాది తాను చూసిన బెస్ట్ ఫిలిం ఇదే అంటూ కితాబు కూడా ఇచ్చింది. అలాగే ఈ సినిమా కథ అద్భుతం అని, ఇలాంటి మూవీలో నటించడానికి ఒప్పుకున్న నటీనటులకు హ్యాట్సాఫ్ అని ప్రశంశల వర్షం కురిపించింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే..?

నవదీప్ లవ్ మౌళి టీజర్ రిలీజ్
జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. నిజానికి హీరోగా నవదీప్ కు సరైన సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. అందుకే సపోర్టింగ్ రోల్స్ లో చేసాడు. విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ ఇప్పుడ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు.

సినిమా రివ్యూలపై హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో 100 రోజులు ఆడుతుండేవి. కొన్ని సినిమాలు 200 రోజులు ఆడేవి. అలాగే ఇంకొన్ని చిత్రాలైతే ఏకంగా ఏడాది రన్ అవుతుండేవి. అయితే, ఇదంతా గతం, కాలం మారింది. నేటి ఫాస్ట్ యుగంలో ఎంత పెద్ద సినిమా అయినా 2 వారాలు థియేటర్లలో నడిచిందంటే సూపర్ హిట్ అయినట్లే. ఏదైనా సినిమా 20 రోజులు ఆడిందంటే బ్లాక్ బస్టర్ అన్నట్లు భావిస్తున్నారు. దీనికి కారణాలు అనేకం. ప్రేక్షకుల ఆలోచనా సరళి మారడం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బోలెడన్ని ఆప్షన్స్ ఉండటం, వివిధ భాషల సినిమాలను తెలుగులో అందించే ఓటీటీలు, దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్.. ఇలా ఎన్నో కారణాలు. ఇక వీటికి తోడు వెబ్ సైట్లలో రివ్యూలు. సినిమా…

యానిమల్- రణ్ బీర్ వాడిన 500 కేజీల గన్ రియల్
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. డిసెంబర్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు మేకర్స్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథులుగా రానున్నారు.

కాంతార చాఫ్టర్ -1 టీజర్ రిలీజ్
కెజియఫ్ 1&2 తరువాత కన్నడ ఇండస్ట్రీ నుండి ఆ లెవెల్లో హిట్ అయినా కన్నడ సినిమా కాంతార.గత ఏడాది ఏమాత్రం హడావిడి లేకుండా విడుదలైన ఈసినిమా 500కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.కేవలం 20కోట్ల బడ్జెట్ లో తెరకెక్కగా అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. తెలుగులో అయితే ఈసినిమా 30కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.కెజియఫ్ 2 తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో కన్నడ సినిమాకూడా ఇదే.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 పేరుతో వస్తున్న ఈసినిమాను కాంతార లో హీరోగా నటించి డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి ఇందులోకూడా హీరోగా చేస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు.

బాలకృష్ణ హిందీ డైలాగ్స్‌కి ఫిదా అయిన రణబీర్, నెటిజెన్ల ప్రశంసలు
టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకం. సినిమాలలో ఎంత పెద్ద డైలాగ్ అయినా గుక్కతిప్పుకోకుండా అద్భుతంగా చెప్పడంలో ఆయన శైలే వేరు. గంభీరమైన కంఠంతో నాన్ స్టాప్ గా ఆయన డైలాగ్స్ చెప్తుంటే.. థియేటర్లలో విజిల్స్ వేయని అభిమానులు ఉండరు. భాష తెలియనివారు సైతం బాలయ్య డైలాగ్స్ చూస్తే క్లాప్స్ కొడతారంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన తెలుగులోనే కాదు.. హిందీలోనూ తన డైలాగ్స్ తో అదరగొడుతున్నారు. బాలయ్య ట్యాలెంట్ చూసి బాలీవుడ్ స్టార్ హీరో సైతం అచ్చెరువొందారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఆయన ఎంత కమాండ్ తో హిందీలో డైలాగ్స్ చెప్పారో.

డెవిల్- దిస్ ఈజ్ లేడీ రోజ్ ఫుల్ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ఆతరువాత అమిగోస్ సినిమాతో వచ్చాడు. అయితే ఆసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరికళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి.

గీతాంజలి మళ్లీ వచ్చింది.. షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్
హారర్ కామెడీ జోనర్‌లో తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రధారిగా నటించిన బ్లాక్‌బస్టర్ `గీతాంజలి`ను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఇది అంజలి…

మట్కా కోసం వరుణ్ ప్రిపరేషన్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్యనే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. కానీ రీసెంట్ గానే పెళ్లి వల్ల కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. హీరోయిన్ లావణ్యతో వరుణ్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే కదా. డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.దీంతో గత కొద్దిరోజులుగా షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది.

నేడే యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరవనున్న మహేశ్ బాబు, రాజమౌళి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' 'కబీర్ సింగ్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'యానిమల్' మూవీ హిందీ సహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా తెలుగులోనూ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‍లో నేడు (నవంబర్ 27) 'యానిమల్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను నిర్వహించనున్నారు మేకర్స్.