యంగ్ హీరో విశ్వక్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే దాస్ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి సుట్టంలా సూసి పోకలా అనే పాటను రిలీజ్ చేయగా ఆ పాట ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుందో చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు చిత్రబృందం. నిజానికి ఈసినిమాను ముందుగా డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆవారంలోనే పలు సినిమాలు రిలీజ్ అవుతుండటం.. అందులోనూ ఈ సినిమా బ్యానర్ నుండే వస్తున్న సినిమాలు అవ్వడంతో ఈసినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు.
A tale of absolute grit and determination and the rise of a man from rags to riches! 💥💥#GangsofGodavari will arrive in theatres on 8th March, 2024! 🔥🌊 @VishwakSenActor @thisisysr @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri… pic.twitter.com/q5qoqyVi30
— Sithara Entertainments (@SitharaEnts) November 27, 2023
కాగా ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: