నానితో దసరా తీసి బ్లాక్ బాస్టర్ హిట్ తో డైరెక్టర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల.మొదటి సినిమాతోనే 100కోట్ల హిట్ ఇచ్చాడుఈ డైరెక్టర్.అంతేకాదు ఓ స్టార్ హీరో ను అప్పటివరకు చూడని ఊర మాస్ అవతారంలో చూపించి సినిమాను బాగా హ్యాండిల్ చేశాడని పేరు తెచ్చుకున్నాడు.ఇక ఈసినిమా తరువాత శ్రీకాంత్ ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు.మధ్యలో ప్రభాస్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి.అంతేకాదు రామ్ చరణ్ కోసం ఓ స్క్రిప్ట్ చేస్తున్నాడని కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే వాటి విషయంలో క్లారిటీ రాలేదు.ఇక తాజాగా ఈ వార్తలఫై స్పందించాడు శ్రీకాంత్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అవన్నీ రూమర్లేనని నాని అన్నతో తన నెక్స్ట్ సినిమా ఉంటుంది ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో వున్నానంటూ చెప్పుకొచ్చాడు.యాక్షన్ జోనర్ లో ఈసినిమా వుండనుందట.దసరా నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను కూడా నిర్మించే అవకాశాలు వున్నాయి.సో శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ సినిమాను కూడా మళ్ళీ నాని తో చేయనున్నాడు.
ఇక నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్.డివివి దానయ్య నిర్మిస్తున్నాడు ఇటీవలే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈసినిమా తరువాత నాని ,శ్రీకాంత్ సినిమా పట్టాలెక్కవచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: