యానిమల్- రణ్ బీర్ వాడిన 500 కేజీల గన్ రియల్

Art Director Suresh Selvarajan shares interesting facts about animal movie

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. డిసెంబర్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు మేకర్స్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథులుగా రానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు ఈసినిమాకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ ఈసినిమా గురించి చెబుతూ.. ఈసినిమాలో రణబీర్ వాడిన 500కేజీల గన్ విఎఫ్ఎక్స్ క్రియేషన్ కాదని.. అది పూర్తిగా తయారు చేసిన గన్..రియల్ స్టీల్ తో దాదాపు నాలుగు నెలలపాటు ఈ గన్ ను తయారు చేశారు.. ఇప్పటివరకూ ఇండియాన్ సినిమాల్లో ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు.. ఇది పూర్తిగా సందీప్ విజన్ అంటూ తెలిపాడు. మరి ఇంకా ఈసినిమాలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్​కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 12 =