బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘యానిమల్’ మూవీ హిందీ సహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా తెలుగులోనూ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‍లో నేడు (నవంబర్ 27) ‘యానిమల్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను నిర్వహించనున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మేరకు ‘యానిమల్’ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి.. తన తర్వాతి ప్రాజెక్టుని మహేశ్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‍లో రూపొందించేందుకు సిద్ధమయ్యారు రాజమౌళి. మరోవైపు ప్రస్తుతం మహేశ్ హీరోగా రూపొందుతోన్న ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
కాగా ‘యానిమల్’ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: