వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ సంస్థ అమెజాన్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈసినిమా అందుబాటులో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా అనిల్ రావిపూడి భగవంత్ కేసరి మేకర్స్ నుండి కాస్ట్లీ గిఫ్ట్ ను అందుకున్నాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో మేకర్స్ అనిల్ కు ఓ ఖరీదైన కారును బహుమతిగా అందించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా కాజల్ హీరోయిన్ గా నటించింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈసినిమాకు సినిమాటోగ్రఫి.. సి.రామ్ ప్రసాద్, సంగీతం.. ఎస్ థమన్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: