మట్కా కోసం వరుణ్ ప్రిపరేషన్

varun tej is back to preparation for matka movie

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్యనే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. కానీ రీసెంట్ గానే పెళ్లి వల్ల కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. హీరోయిన్ లావణ్యతో వరుణ్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే కదా. డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.దీంతో గత కొద్దిరోజులుగా షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మళ్లీ తన సినిమా షూటింగ్ లపై ఫోకస్ ను పెట్టనున్నాడు వరుణ్ తేజ్. దీనిలో భాగంగానే తన కొత్త సినిమా మట్కా షూట్ కు సిద్దమవ్వనున్నట్టు తెలుస్తుంది. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పీరియాడిక్ డ్రామాగా 1960 బ్యాక్ డ్రాప్ తో ఈసినిమాను రూపొందించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉంది. ఈనేపథ్యంలోనే హైద్రాబాద్ శివారులో 1958-1985 మధ్య కాలం నాటి వైజాగ్ సెట్ ను వేస్తున్నారట. మరోవైపు వరుణ్ కూడా ఈసినిమా కోసం మేకోవర్ ను ఛేంజ్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ఈసినిమా కోసం కాస్త సన్నగా కాస్త రగ్డ్ లుక్ లో ఉండాల్సి ఉంటుందట.. ఆమేరకు వరుణ్ తయారవుతున్నాడట. డిసెంబర్ మొదటి వారం నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 5 =