సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు విశాల్. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇక చాలా రోజులు తరువాత తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా టైటిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ షాట్ ను డిసెంబర్ 1వతేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Flame up the excitement 🔥#Vishal34 – Title Reveal with FIRST SHOT on 1.12.2023. #Hari @stonebenchers @ZeeStudiosSouth pic.twitter.com/2dcnRAbchJ
— Vishal (@VishalKOfficial) November 27, 2023
కాగా మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























