హాయ్ నాన్న- ఓడియమ్మ పార్టీ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

hi nanna movie odiyamma party song release date

ఇక ఈసారి తన జోనర్ ను పూర్తిగా మార్చేసి లవ్ ప్లస్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఈసినిమా వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని అయితే పెంచేశాయి. ఈసినిమా ట్రైలర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ ఫుల్ ఎషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిందని చెప్పొచ్చు. తల్లికి దూరం అయిన కూతురుని తండ్రి ఎలా పెంచాడు, తన గతం ఏంటి, వాళ్ళ లైఫ్ లోకి మృణాల్ ఎంటర్ అయిన తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా కథ. ట్రైలర్ తో సినిమాపై అంచనాలను అయితే మరింత పెంచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటిపాట సమయమా తోనే అడియోపై మంచి హైప్ క్రియేట్ చేశారు. ఆ తరువాత గాజు బొమ్మ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈసారి పార్టీ సాంగ్ తో రాబోతున్నారు. ఓడియమ్మ అంటూ వచ్చే ఈపాటను రేపు అంటే నవంబర్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈపాటకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఈపాటలో శృతిహాసన్ కూడా కనిపించనుంది.

ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.వి.మోహ‌న్‌, డాక్ట‌ర్ విజేందర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =