హారర్ కామెడీ జోనర్లో తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రధారిగా నటించిన బ్లాక్‌బస్టర్ `గీతాంజలి`ను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్లో గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఇది అంజలి నటిస్తోన్న 50వ సినిమా కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సీక్వెల్ స్టార్ట్ అవుతుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలన్నీ ఒక ఎత్తైతే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో హారర్ కామెడీ వాటన్నింటినీ మించేలా ఉంటుందని, హైదరాబాద్, ఊటీల్లో ఈ సినిమా కథాంశం సాగుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణను పూర్తి చేశామని, ఊటీలో ఓ షెడ్యూల్‌ను చిత్రీకరించాల్సి ఉందని వివరించారు. ఆ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసి వచ్చే 2024 ప్రారంభంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు.
కాగా యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ఎప్పుడూ ముందుండే కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ సినిమా ద్వారా తన మార్క్‌ను చాటుకుంటోంది. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రాహుల్ మాధవ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. అలాగే ‘నిన్ను కోరి’, ‘నిశ్శబ్దం’ చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అట్లాంటా (యూఎస్)కు చెందిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటిని డైరెక్టర్‌గా ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, సునీల్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, ప్రియ, ముక్కు అవినాష్, విరుపాక్ష రవి, రాహుల్ మాధవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: