ఎంతోకాలం ప్రేమాయణం సాగించిన తరువాత లేడీ సూపర్ స్టార్ నయనతార , విఘ్నేష్ శివన్ వివాహబంధంతో బయటయ్యారు. గతేడాది జూన్ లో వీరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రలైనట్టు ప్రకటించి ఒకరకంగా అందరికీ షాకిచ్చారు. అయితే సరోగసి ద్వారా గతేడాది అక్టోబర్ లో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఇక అప్పుడుప్పుడు పిల్లలతో బయట కనిపిస్తున్నారు కూడా. అయితే ఇప్పటివరకూ వారిద్దరినీ చూపించింది లేదు. ఇక ఇప్పుడు తన పిల్లల పూర్తి పేర్లను ప్రకటించారు నయన్ దంపతులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమ పిల్లలకు ఉయిర్ మరియు ఉలగ్ అని పేర్లు కూడా పెట్టినట్లు తాము పేరెంట్స్ అయ్యాం అని చెప్పినప్పుడే ప్రకటించారు. అయితే పూర్తి పేర్లను నేడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఒక కొడుకు పేరు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ అని, రెండో కొడుకు పేరు ఉలగ్ ధైవాగ్ ఎన్ శివన్ అని తెలిపారు.
Dear friends ❤️
We have named our blessings , our babies like this ❤️#Uyir RudroNeel N Shivan
உயிர் ருத்ரோநீல் N சிவன்#Ulag Daiwik N Shivan
உலக் தெய்விக் N சிவன்N stands for their best mother in the world #Nayanthara ❤️
Happiest & proudest moments of life #Blessed pic.twitter.com/r4RHp0wC8f
— VigneshShivN (@VigneshShivN) April 3, 2023
కాగా ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా రాణించిన నయనతార ఇప్పుడు లేడీ గా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఒక పక్క హీరోల పక్కన సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ తో నటిస్తున్నారు. ఇది జూన్ 2, 2023న థియేటర్లలో విడుదల కానుంది.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























