ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈసినిమా రిలీజ్ అయిన ఏడాది పూర్తయి ఇంకా ఈసినిమా గురించి మాట్లాడుతుంటున్నామంటేనే అర్థమవుతుంది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చరిత్రలో అసలు కలవని ఇద్దరు స్వతంత్య్ర సమరయోధుల కథలను తీసుకొని ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని ఫైనల్ గా అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డును సైతం దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా విదేశాల్లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమాను జపాన్ లో గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పుడు అక్కడ సంచలనాలు సృష్టిస్తుంది. ఈసినిమా రిలీజ్ అయి అక్కడ 164 రోజులు అవుతున్నాఇంకా సినిమా సక్సెస్ ఫుల్ ప్రేక్షకులను రాబడుతూ సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. 164 రోజుల్లో 1మిలియన్ ప్రేక్షకులను అలరించింది. అక్కడ ఒక్క చోటే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసుకుంది ఈసినిమా. 24ఏళ్ల క్రితం జపాన్ దేశంలో రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ముత్తు’ సినిమా రికార్డ్ వసూళ్లను ఆర్ఆర్ఆర్ సినిమా బద్దలు కొట్టింది. మరి ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలుకొట్టాలంటే ఎన్నాళ్లు పడుతూందో చూడాలి.
#RRRMovie records 1 Million+ footfall in 164 Days and continues its rocking run ❤️ 🙌🏻 #RRRinJapan. pic.twitter.com/1nKvXbXUTN
— RRR Movie (@RRRMovie) April 4, 2023
ఇదిలా ఉండగా ఈసినిమా విదేశాల్లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమాను జపాన్ లో గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా.
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: