యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం డీజే టిల్లు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా పేరుతెచ్చుకున్న ఈ సీక్వెల్, టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో వస్తుంది. ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా.. ప్రారంభంలో హీరోయిన్ సమస్యను ఎదుర్కొంది. మొదట అనుపమా పరమేశ్వరన్ ను తీసుకున్నారు అయితే అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకుంది. ఆతరువాత శ్రీ లీల, మడోన్నా సెబాస్టియన్ ,మీనాక్షి చౌదరి ఇలా కొందరి పేర్లు అనుకున్నారు కానీ వారిలో ఎవరూ ఫిక్స్ కాలేదు. అయితే మళ్ళీ అనుపమనే సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల సినిమాలో నుండి ఆమె ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 11న ఈసినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ రిలీజ్ డేట్ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఒకవేళ అదే డేట్ కు ఫిక్స్ అయితే సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది. ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ కూడా విడుదలకానుంది.మరి అదే డేట్ తో టిల్లు స్క్వేర్ మేకర్స్ రిస్క్ చేస్తారా లేదా కొత్త డేట్ ను ఫిక్స్ చేసుకుంటారా అనేది తెలియాల్సివుంది.
టిల్లు స్క్వేర్ ను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్,శ్రీకరా స్టూడియోస్ ,ఫార్చ్యూన్ 4సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: