సల్మాన్-వెంకీ తో చెర్రీ మాస్ స్టెప్పులు

yentamma song released from kisi ka bhai kisi ki jaan

సల్మాన్ ఖాన్ హీరోగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో టాలీవుడ్ అగ్రహీరో వెంకీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో మెగావపర్‌ స్టార్‌ స్పెషల్‌ అప్పియరెన్స్ ఇస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. పాటలో రామ్ చరణ్ కనిపిస్తాడన్న కథనాలు రావడంతో పాటను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృత‌గా వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో తాజాగా ఏంటమ్మా వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మంచి కలర్ ఫుల్ గా విజువల్స్ తో ఉన్న ఈపాటలో సల్మాన్, వెంకీ డ్యాన్స్ చేస్తుండగా చరణ్ ఎంట్రీ ఇస్తాడు. రామ్ చరణ్ స్పెషల్ ఎంట్రీ మరో రేంజ్ అని చెప్పాల్సిందే. పచ్చ చొక్కా, తెల్ల లుంగీలో వెంకీమామ, సల్లూభాయ్, చెర్రీ అదిరిపోయే స్టెప్పులు వేసి అదరగొట్టేశారనే చెప్పాలి. ఇక పూజా కూడా లుంగీలో స్టెప్స్ వేసి కెవ్వు కేక అనిపించేసింది.

కాగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు జగపతి బాబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి వెంకీ-సల్మాన్ ఎప్పటినుండో ఫ్రెండ్స్.. ఇద్దరూ కామెడీని ఈజీగా పండించగలరు.. దీంతో సల్మాన్ ఖాన్‌, వెంక‌టేషే క్రేజీ కాంబినేష‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం సల్మాన్-వెంకీ కాంబినేషన్ ఎలా ఉంటుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =