బోయపాటి గారు అప్పుడే విలన్ గా ఫిక్స్ అయ్యారు

young hero prince about RAPO20 movie

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో యంగ్ హీరో ప్రిన్స్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాలో ఏకంగా విలన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నాడు. ఈనేపథ్యంలో తన రోల్ గురించి చెబుతూ.. ఈసినిమా కోసం నార్మల్ గా ఉండే విలన్ లను తీసుకోవడానికి బోయపాటి శ్రీను గారు ఇంట్రెస్ట్ గా లేరు.. ఒక యంగ్ విలన్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారు.. ఆ సమయంలో డీజే టిల్లు సినిమాలో నన్ను చూశారు.. అప్పుడే తన పాత్రకు తగ్గతగ్గ విలన్ దొరికాడని బోయపాటిగారు అనుకున్నారు.. అప్పుడు నన్నుఅడిగారు.. విలన్ పాత్రలో నటించాడని ఓకే నా అని.. రోల్ ఎగ్జయిటింగ్ ఉంది.. పాన్ ఇండియా సినిమా కాబట్టి యస్ చెప్పాను.

ఇప్పటికే ఈసినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చిత్రీకరించాం.. చాలా బాగా వచ్చాయి.. ఈసినిమా కోసం నా మేకోవర్ ను కూడా చాలా మార్చుకున్నాను.. రామ్ కు క్యారెక్టర్కు సెట్ అయ్యేలా నేను కూడా గడ్డం పెంచాను.. నాపాత్ర గురించి ఎక్కువ చెప్పేను కానీ ఈసినిమాలో ఇప్పటివరకూ చూడని అవతార్ లో నన్ను చూస్తారు అని తెలిపాడు.

కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 6 =