సినిమా తీసేప్పుడు కూడా తమ సినిమాకు ఈరేంజ్ లో ఆదరణ లభిస్తుందని అనుకొని ఉండరు బలగం చిత్రయూనిట్. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందంటే మాములు విషయం కాదు. కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఈసినిమాతో దర్శకుడిగా మారి సక్సెస్ ను అందుకున్నాడు. వేణు నుండి సినిమా వస్తుంది అంటే ఎలా ఉంటుందో అనుకున్నారు కానీ తెలంగాణ సంస్కృతి, మానవ సంబంధాలని మనసులకు హత్తుకునేలా భావోద్వేగాలతో నిండిన కథను తీసుకొచ్చి దర్శకుడిగా విజయాన్ని సాధించాడు. అందుకే రిలీజ్ అయి నెల రోజులు అయిపోతున్నా కూడా ఈసినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమా కలెక్షన్స్ పరంగా పదింతలు లాభాలు అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లగొడుతుంది. ఇటీవలే బలగం సినిమా రెండు లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది. ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు(ఉక్రెయిన్) సొంతం చేసుకుంది. ఆ అవార్డు వచ్చిందో లేదో తాజాగా మరో నాలుగు అవార్డులు బలగం సినిమాకు అందనున్నాయి. అమెరికా వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో నాలుగు కేటగిరీల కింద బలగం సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ ఫ్యూచర్ డైరెక్టర్ గా వేణుకు, బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ ఫ్యూచర్ కేటగిరీ కింద హీరో ప్రియదర్శికి.. బెస్ట్ యాక్టరస్ ఇన్ ఏ ఫూచర్ కేటగిరీ కింద హీరోయిన్ కావ్య కల్యాణ్ రాంకు, బెస్ట్ నేరేటివ్ ప్యూచర్ కేటగిరీ లో డైరెక్టర్ వేణుకు ఈ అవార్డ్స్ వచ్చాయి. ఇలా వరుసగా తమ చిత్రానికి వరుసగా అంతర్జాతీయ అవార్డులు వస్తుండటంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగితేలుతున్నారు.
#Balagam does it big again! 🤩🔥
The film has won four awards in the following categories:
Best Feature Director
Best Actor in a Feature
Best Actress in a Feature
and Best Narrative Feature#BalagamGoesGlobal pic.twitter.com/1EM9wTZ7SR— Dil Raju Productions (@DilRajuProdctns) April 3, 2023
కాగా ప్రియదర్శి ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: