దసరా పై ప్రభాస్ రివ్యూ

pan india star prabhas praises on dasara movie

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద న్యాచురల్ స్టార్ నాని హవా నడుస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలోనాని పక్కా ఊరమాస్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకోవడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను సైతం రాబట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను చూసిన సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చాలామంది తమ రివ్యూలను ఇచ్చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన రివ్యూ ఇచ్చేశాడు.. ఇప్పుడు దసరా చూశాను.. వాట్ ఏ మూవీ.. నాకు చాలా బాగా నచ్చింది అంటూ నాని, కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్రయూనిట్ అందరికీ అభినందనలు తెలిపారు. అంతేకాదు ఇలాంటి సినిమా ఇంకా మనం ఎన్నో చేయాలి అంటూ తన ఇన్ట్సా పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.