స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార, సమంత ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉండగా వారితో పాటు కీర్తి సురేష్ ఇంకా పలువురు హీరోయిన్లు ఇప్పటికే లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేయగా.. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఆలిస్ట్ లో చేరిపోయింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కుఎదిగింది. ‘పుష్ప’ సినిమాతో తన ఇమేజ్ ని అమాంతం పెంచుకుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక ఈ ఏడాది స్టార్టింగ్ లోనే వారసుడు సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. రీసెంట్ గానే హిందీలో మిషన్ మజ్ను సినిమా రిలీజ్ అవ్వగా ఆ సినిమా అంత విజయాన్ని అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు రష్మిక ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తుంది. ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేస్తూ తాజాగా ప్రకటించారు చిత్రయూనిట్. రెయిన్ బో అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. కాగా శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈసినిమాలో దేవ్ మోహన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై తెలుగు ఇంకా తమిళ్ లో ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈసినిమాను నిర్మిస్తున్నారు. కెఎమ్. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తుండగా, భాస్కరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమా రెగ్యులర్ షూట్ ను ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
Today marks the start of a colourful journey. Join us as we bring the world of #Rainbow to life! 🌟 @iamRashmika @ActorDevMohan @bhaskaran_dop @justin_tunes @thamizh_editor #Banglan @sivadigitalart @Shantharuban87 @prabhu_sr#RainbowFilm #RainbowPooja pic.twitter.com/puANA99qWM
— DreamWarriorPictures (@DreamWarriorpic) April 3, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: