కీర్తి సురేష్ కూడా ఇప్పుడు ప్రతి సినిమాలో తన పాత్ర డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటుంది. అందుకే డిఫరెంట్ గా సినిమాలు ఎంచుకుంటూ కేరీర్ లో దూసుకుపోతుంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ కు కూడా సక్సెస్ రేట్ కాస్త తక్కువనే చెప్పొచ్చు. సినిమా అవకాశలకు అయితే మాత్రం ఎలాంటి కొదువలేదు కానీ విజయాల కంటే అపజయాలే ఎక్కువ సొంతం చేసుకుంది. కానీ మహానటి లాంటి సినిమాతో మాత్రం తనేంటో నిరూపించుకుంది. ఇక మహానటి తరువాత పలు లేడీ ఒరియెంటెడ్ సినిమాలే చేసినా అవి కూడా సక్సెస్ అందించలేకపోయాయి. ఇక ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. గతఏడాది సర్కారు వారి పాట సినిమాతో హిట్ ను అందుకున్న కీర్తి సురేష్ ఆ తరువాత సాని కాయిదం సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు కానీ ఓటీటీలో రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Mass moves from the #DhoomDhaamBlockbuster Dasara🥁
Get dancing now 💃🕺
– https://t.co/yEUfydQd2i#Dasara
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP @saregamasouth pic.twitter.com/7Y7XGSSfPh— SLV Cinemas (@SLVCinemasOffl) April 3, 2023
ఇక ఈఏడాది దసరా తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాలో తనలో కూడా ఊర మాస్ యాక్ట్రెస్ దాగుందని తెలియచేసింది. అసలే రా అండ్ రస్టిక్ సినిమా.. తెలంగాణ బ్యాక్ గ్రౌండ్.. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్.. దానికి తగ్గట్టే వెన్నెల పాత్రలో జీవించేసింది కీర్తి సురేష్. అందుకే ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘వెన్నెల’ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాలో హైలెట్ గా నిలిచిన కీర్తి సురేష్ పెళ్లి కూతురు గెటప్ లో చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. పెళ్లి కూతురిగా కీర్తి సురేష్ ఈ సినిమాలో బ్యాండు మేళం ముందు మాస్ డాన్స్ చేస్తుంది. చూడటానికి ఇది చిన్న బిట్ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఇది ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా కనిపిస్తుంది. ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తుంది. ఇక ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























