దసరాపై జక్కన్న కామెంట్స్

rajamouli interesting comments on nani dasara movie

ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దసరా సినిమా గురించే వినిపిస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా దసరా. మార్చి 30వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఫుల్ రా అండ్ రస్టిక్ గా ఈసినిమాను తెరకెక్కించాడు శ్రీకాంత్. దర్శకుడిగా మొదటి సినిమా అయినా కూడా కథని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడంతో శ్రీకాంత్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అంతేకాదు నాని, కీర్తి సురేష్ కూడా మాస్ రోల్స్ లో నటించారు అని చెప్పడం కంటే జీవించారు అని చెప్పొచ్చు. కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించారు. దాని ఫలితమే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కనిపిస్తుంది. ఈసినిమా నాలుగు రోజుల్లో 87 కోట్లు కలెక్ట్ చేసి వంద కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాపై సెలబ్రిటీలు కూడా స్పందించి ప్రశంసిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు స్పందించి చిత్రయూనిట్ ను కొనియాడారు. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. రా పాత్రలతో శ్రీకాంత్ ఓదెల ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ చిత్రీకరించారు. నాని ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించాడు. ఇక కీర్తి సురేష్ తన పాత్రలో కేక్ వాక్ చేసినట్లే నటించింది. ఈ చిత్రంలో ప్రతి నటుడు పాత్ర గుర్తుండిపోయే విధంగానే ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ చాల బావున్నాయి. దసరా టీం మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. మరి రాజమౌళి నుండి ట్వీట్ రావడంతో చిత్రయూనిట్ తో పాటు నాని ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 15 =