విశ్వక్ కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు?

two heroines for vishwak sens new movie

డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే వరుసగా అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ధమ్కీ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే రిలీజ్ అయిన ధమ్కీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టుకుంటుంది. ప్రస్తుతం విశ్వక్ గామి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. రీసెంట్ గానే తన 11వ సినిమాను ప్రకటించారు మేకర్స్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమాలో నటించే హిరోయిన్ల గురించి తాజాగా ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈసినిమాలో విశ్వక్ కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్లు ఎవరో కాదు అంజలి ఇంకా డీజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్ననేహా శెట్టి.. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ,శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు. హీరోయిన్‌, ఇతర నటీనటులతో పాటు సిబ్బంది వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − five =