మాస్ మహారాజ రవితేజ హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కోసం ఈశుక్రవారం రావణాసుర తో రానున్నాడు. ఇంతకుముందు ధమాకా తో 100కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రవితేజ ఈసంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మరో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు రావణాసుర ను దింపుతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సినిమా 141.56నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది. దీనికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ ,దక్షా నాగర్కర్ ,మేఘా ఆకాష్ ,పూజిత పొన్నాడ, ఫారియా అబ్దుల్లా హీరోయిన్లు గా నటించారు. యంగ్ హీరో సుశాంత్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా అభిషేక్ అగర్వాల్ ,రవితేజ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విజయంపై రవితేజ సూపర్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.
ఇక ప్రస్తుతం రవితేజ, టైగర్ నాగేశ్వరావు అనే చిత్రంలో నటిస్తున్నాడు. స్టూవర్టుపురం దొంగ, టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రవితేజ టైటిల్ రోల్ లో కనిపించనున్నాడు.వంశీ డైరెక్ట్ చేస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈచిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకులముందుకు రానుంది. రవితేజకి ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: