నాని,కీర్తి సురేష్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ దసరా గత గురువారం విడుదలై నాలుగు రోజులు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా 5వరోజు కూడా డీసెంట్ హోల్డ్ ను కొనసాగించింది. వర్కింగ్ డే కావడం అలాగే నైట్ షోస్ మీద ఐపీఎల్ ప్రభావం వున్నా కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది. ఇక ఈసినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2కోట్ల షేర్ ను రాబట్టి మొత్తం 5రోజుల్లో 34కోట్ల షేర్ నుకలెక్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచవ్యాప్తంగా 5రోజుల్లో ఈచిత్రం 92కోట్ల గ్రాస్ ను రాబట్టగా అందులో 50కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది అలాగే ఎంసీఏ కలెక్షన్స్ బీట్ చేసి నాని మొదటి 50కోట్ల షేర్ మూవీగా దసరా నిలిచింది. భారీ బడ్జెట్ మూవీగా వచ్చిన దసరా కేవలం 5రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకొచ్చే దిశగా దూసుకుపోతుంది. ఇక అటు యూఎస్ఏలో ఈచిత్రం 5రోజుల్లో 1.7 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. అయితే ఈశుక్రవారం..రావణాసుర,మీటర్ విడుదలకానున్నాయి. దాంతో దసరాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.
Dharani continues to rule the Box Office 💥#Dasara grosses 92+ CRORES WORLDWIDE IN 5 DAYS 🔥
Watch #Dasara in cinemas today 💥
– https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster@NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/3KJ9eMiTfr— SLV Cinemas (@SLVCinemasOffl) April 4, 2023
రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో నాని, ధరణి పాత్రలో నటించగా కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో నటించింది. నాని తోపాటు కీర్తి కూడా తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇక ఈసినిమాలో పెళ్లి లో కీర్తి చేసిన తీన్మార్ డ్యాన్స్ హైలైట్ అయ్యింది. ఆవీడియోను మేకర్స్ నిన్న విడుదలచేశారు. ఈవీడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు యూట్యూబ్ లో 15లక్షలకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























