పుష్ప :ది రూల్ కాన్సెప్ట్ వీడియో టీజర్ రిలీజ్ 

Allu Arjun's Pushpa The Rule Latest Update: Where is Pushpa?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప :ది రూల్ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈనెల 7న సాయంత్రం 4:05 గంటలకు ఈకాన్సెప్ట్ వీడియో ను విడుదలకానుందని కొద్దీ సేపటి క్రితం ఒక చిన్నటీజర్ ద్వారా మేకర్స్ తెలిజేశారు. ఇక ఈ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో పారిపోయిన పుష్ప ఎక్కడ వున్నాడు అంటూ టీజర్ సార్ట్ అయ్యింది. అసలు పుష్పను ఎందుకు అరెస్ట్ చేసారు? జైలు నుండి తప్పించుకొని ఎటువెళ్ళాడు? పెళ్లి తరువాత ఏం జరిగింది అనే విషయాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి చాలా రోజుల నుండి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఈ కాన్సెప్ట్ వీడియో టీజర్ ఖుషి చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ కాన్సెప్ట్ వీడియో తో పాటు అల్లు అర్జున్ బర్త్ డే రోజు ఏప్రిల్ 7న  పుష్ప :ది రూల్ నుండి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కూడా విడుదలకానుంది. గత ఏడాది విడుదలైన పుష్ప :ది రైజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా మూవీ గా వచ్చిన ఈచిత్రం తెలుగు తోపాటు హిందీలో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. హిందీలో ఏకంగా 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది దాంతో పుష్ప :ది రూల్ పై అక్కడ భారీ అంచనాలు వున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 10 =