
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 106


సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన టీజర్ రిలీజ్

ప్రాజెక్ట్ కే షూటింగ్ ప్రోగ్రెస్

జవాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

నిఖిల్ స్పై రిలీజ్ డేట్ ఫిక్స్

పీరియాడిక్ డ్రామా లో మెగాప్రిన్స్?
విరూపాక్ష2 అంతకు మించి ఉండాలి

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంతోష్ కు ఆసెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

హనుమాన్ రిలీజ్ డేట్ వాయిదా

జైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఖుషి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

NBK 108 కోసం పవర్ ఫుల్ ఇంటర్వెల్ సీక్వెన్స్

సలార్ పాత్రపై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లాల్ సలామ్ రజనీ ఫస్ట లుక్ రిలీజ్
సూపర్ట్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం రజనీ జైలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమాను ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన టీజర్ రిలీజ్
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ కాస్త డిఫరెంట్ గా ఉండే కథలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇక ఈఏడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. అయితే ఈసినిమా మంచి విజయాాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను గత ఏడాది సందీప్ కిషన్ పుట్టినరోజు నాడు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి…

రామ్-బోయపాటి మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ది ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, మాస్ ఎక్కువగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి రాపో20 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

ప్రాజెక్ట్ కే షూటింగ్ ప్రోగ్రెస్
నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. సైన్స్ ఫిక్స్ నేపథ్యంలో భారీ స్థాయిలో ఈసినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేశాయి. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్సే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జవాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ కు బ్లాస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన షారుఖ్ కు ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ప్రస్తుతం జవాన్ అనే సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు పలు కథనాలు వస్తున్నాయి.

కస్టడీ కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశా-కృతి శెట్టి
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ' మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్‌కుమార్ సమర్పిస్తుండగా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో హీరోయిన్ కృతి శెట్టి మీడియా సమావేశంలో పాల్గొని ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

నిఖిల్ స్పై రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు స్పై గా వచ్చేస్తున్నాడు నిఖిల్. గారీ బి.హెచ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో ప్రారంభించారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేపనిలో ఉన్నారు.

బిచ్చగాడు 2 తో మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం- విజయ్ ఆంటోనీ
2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తో వస్తున్నాడు. విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

పీరియాడిక్ డ్రామా లో మెగాప్రిన్స్?
మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇక గత ఏడాది ఎఫ్ 3, గని సినిమాతో ప్రేక్షకులతో ముందుకు రాగా.. వాటిలో ఎఫ్ 3 సినిమా హిట్ అయింది కానీ గని సినిమా మాత్రం పరాజయాన్ని అందించింది. ప్రస్తుతం అయితే వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. దీనితో పాటు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
విరూపాక్ష2 అంతకు మించి ఉండాలి
సాయి ధరమ్ తేజ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాయి తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా ఇక్కడ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవడంతో ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళ్, హిందీ, మలయాాళం భాషల్లో మే 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

పొన్నియన్ సెల్వన్ 2 ఫస్ట్ వీక్ బ్లాస్టింగ్ కలెక్షన్స్
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ ప్రాంచైజ్ పొన్నియన్ సెల్వన్. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో.. ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచరస్ గా ప్రాజెక్ట్ రెండు పార్ట్ లుగా చిత్రీకరించారు. ఈ సినిమా పార్ట్ 1 వచ్చే ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయింది. ఏప్రిల్ 28వ తేదీన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ ఇంకా ఎంగేజింగ్ ఉండటం.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కథ అన్నీ పర్ఫెక్ట్ గా…

ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ డే కి బ్లాస్టింగ్ గ్లింప్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ఇప్పటికే ఫస్ట షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు మరోపక్క ఎడిటింగ్ పనులను కూడా మొదలుపెట్టేశారు. మరోవైపు సెకండ్ షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ కూడా ఇచ్చారు హరీష్ అండ్ టీమ్. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. స్పెషన్ డే కు ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ స్పెషన్ డేట్ మరేదో కాదు మే 11. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్…

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా ట్రైలర్ పై ప్రకటన వచ్చేసింది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ ఈ సినిమా తెరకెక్కింది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఫైనల్లీ జూన్ లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేయటానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లతో పాటు టీజర్ రిలీజ్ అయింది. టీజర్ కు కాస్త వ్యతిరేకత రావడంతో టైమ్ తీసుకొని ఇంకాస్త శ్రద్ద పెట్టారు. అందుకే చాలా కాలంగా ఈసినిమా నుండి సాలిడ్…
సంతోష్ కు ఆసెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
ఇండస్ట్రీలో కొన్ని కొన్ని బ్యానర్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆ బ్యాన్ర్స నుండి సినిమాలు వస్తున్నాయి అంటే ఆసినిమాలపై ఆటోమేటిక్ గా అంచనాలు ఏర్పడతాయి. ఈసినిమాపై నమ్మకం ఏర్పడుతుంది. అలాంటి ప్రొడక్షన్ సంస్థే వైజయంతి మూవీస్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ కూడా ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ఎప్పటినుండో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది ఈసంస్థ. ఎంతో మంది హీరోలకు ఎన్నో హిట్ సినిమాలను అందించి వారి జాతకాలనే మార్చేసింది ఎంతో మంది హీరోలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయే చిత్రాలు నిర్మించింది.

హనుమాన్ రిలీజ్ డేట్ వాయిదా
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. అందులోనూ సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు చిత్రబృందం. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ రిలీజ్ చేశారు.

జైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన చివరి సినిమా అన్నాత్తే. 2021లో ఆసినిమా రిలీజ్ అయింది. ఇక ఆసినిమా తరువాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు చిన్న గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.

ఖుషి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఖుషి. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శివ నిర్వాణ. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టింద చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే మ్యూజికల్ బ్లాస్ట్ అంటూ మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 9వ తేదీన ఈసినిమా ఫస్ట్ సింగిల్…

NBK 108 కోసం పవర్ ఫుల్ ఇంటర్వెల్ సీక్వెన్స్
ఈఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. NBK 108 అనే టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమానుండి పలు పోస్టర్లను రిలీజ్ చేశారు.

వాల్తేరు వీరయ్య తరువాత విరుపాక్షనే
ఈఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో వీరవిహారం చేసిందో తెలిసిందే.ఏకంగా 200కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మెగాస్టార్ చిరంజీవికిబ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది.ఈసినిమా విడుదలైన మొదటి రోజు నుండి వరుసగా 12 రోజులు ప్రపంచ వ్యాప్తంగా కోటి రూపాయలకు పైగా షేర్ ను రాబట్టి సత్తాచాటింది.ఇక ఈసినిమా సరసన ఇప్పుడు విరూపాక్ష చేరింది.వాల్తేరు వీరయ్య రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోయినా అంచనాలకు మించి అదరగొడుతుంది.విరూపాక్ష ప్రస్తుతం థియేటర్లలో దుమ్మురేపుతున్న సంగతి తెల్సిందే.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.

సలార్ పాత్రపై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్ తరువాత మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే ఈ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తెలుగు లో సలార్, పుష్ప 2, మహేష్ బాబు సినిమా లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూనే మరోపక్క పలు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన రామబాణం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలో ఆయన కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.