వాల్తేరు వీరయ్య తరువాత విరుపాక్షనే

After Waltari Veerayya, Virupaksha Gets Massive Collections

ఈఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో వీరవిహారం చేసిందో తెలిసిందే.ఏకంగా 200కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మెగాస్టార్ చిరంజీవికిబ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది.ఈసినిమా విడుదలైన మొదటి రోజు నుండి వరుసగా 12 రోజులు ప్రపంచ వ్యాప్తంగా కోటి రూపాయలకు పైగా షేర్ ను రాబట్టి సత్తాచాటింది.ఇక ఈసినిమా సరసన ఇప్పుడు విరూపాక్ష చేరింది.వాల్తేరు వీరయ్య రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోయినా అంచనాలకు మించి అదరగొడుతుంది.విరూపాక్ష ప్రస్తుతం థియేటర్లలో దుమ్మురేపుతున్న సంగతి తెల్సిందే.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విరూపాక్ష కూడా వాల్తేరు వీరయ్యలాగే వరుసగా 11 రోజుల్లో కోటి రూపాయలకు పైగా షేర్ ను రాబట్టి ఈఏడాది అత్యధిక రోజులు వరుసగా కోటి రూపాయల షేర్ ను రాబట్టిన సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.ఇదిలావుంటే విరూపాక్ష ప్రపంచ వ్యాప్తంగా 12వ రోజు 1.3కోట్ల గ్రాస్ ను రాబట్టింది దాంతో ఓవరాల్ గా12రోజుల్లో 82.5కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది అయితే రేపు రామబాణం,ఉగ్రం విడుదలకానుండడంతో విరూపాక్షకు పోటీ ఎదురుకానుంది.మరి ఈ రెండు సినిమాలను తట్టుకొని విరుపాక్ష ఎలా పర్ఫార్మ్ చేస్తుంది చూడాలి.

సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించగా కార్తీక్ దండు డైరెక్ట్ చేశాడు. బివిఎస్ఎన్ ప్రసాద్,సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు.ఇక ఈసినిమా అదే టైటిల్ తో రేపు హిందీతోపాటు తమిళ,మలయాళ భాషల్లో విడుదలకానుంది.ప్రస్తుతం విరుపాక్ష టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గావుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 8 =