కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 105

samantha starrer shaakuntalam movie streaming on-amazon prime
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన శాకుంతలం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికి పైగా అయిపోతున్నాా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాల్లో మాత్రమే నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంది. మేకర్స్ కూడా సమంత క్రేజ్ దృష్ట్యా తనపై భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఇక రీసెంట్ గా సమంత ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన ప్రేమకావ్యం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు గుణశేఖర్. ఈసినిమా ఏప్రిల్ 14వ…

TFN Adminవాట్సాప్
dhanush captain miller movie first look and teaser update
ట్రైలర్ & టీజర్

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్, టీజర్ అప్ డేట్

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ “కెప్టెన్ మిల్లర్” . 1930-40ల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా ఇప్పటికే స్టన్నింగ్ మేకింగ్ విజువల్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.

TFN Adminవాట్సాప్
ram and boyapati srinu movie teaser update
ట్రైలర్ & టీజర్

RAPO 20 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
sudheer babu harom hara movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

సుధీర్ బాబు హరోం హర రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక రేపు సుధీర్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ఒకరోజు ముందుగానే తన సినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు. ఫస్ట్ ట్రిగ్గర్ అంటూ ఒక చిన్న వీడియోను విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
VD 12 producer naga vamsi solid counter on negative comments
ఫస్ట్ లుక్

VD12 పోస్టర్ విమర్శలపై నాగవంశీ కౌంటర్

దర్శకధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ కే బాహుబలి సినిమా పోస్టర్ విషయంలో కాపీ కొట్టాడన్న విమర్శలు తలెత్తాయి. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇప్పుడు అది ఇంకా ఎక్కువైంది. ఈమధ్య చాలా సినిమాలు ఆవిమర్శల బారిన పడుతున్నాయి. పలానా దగ్గర కాపీ కొట్టారు.. అక్కడ నుండి కాపీ కొట్టారు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాకు కూడా విమర్శలు మొదలయ్యాయి.

TFN Adminవాట్సాప్
shah rukh khan shares interesting things about jawan movie
సినిమా వార్తలు

జవాన్ ఓ కొత్త రకం జోనర్

తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా జవాన్. వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న అట్లీ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. అంతేకాకుండా అట్లీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉండటంతో ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ముందు జూన్ 2వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు.. కానీ వీఎఫ్ఎక్స్ వల్ల లేట్ అవుతుండటంతో సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
pawan kalyan OG movie power packed long schedule wrapped up
షూటింగ్ అప్‌డేట్

పవన్ OG యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ముందు ముందు పవన్ రాజకీయాలతో బీజీగా ఉండాల్సి వస్తుంది అందుకే ఇప్పుడే వీలైనన్ని రోజులు షూటింగ్ లకు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ అటు హరీష్ శంకర్ సినిమాతో అలానే సుజీత్ ఓజీతో షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ లను మాత్రం చాలా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. గత నెలలో ఓజీ సినిమా షూటింగ్ ను ముంబైలో మొదలుపెట్టగా అక్కడ కొన్ని రోజులు షూట్ ను జరుపుకొని ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. అనంతరం మరో షెడ్యూల్ ను పూణేలో రీసెంట్ గానే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈషెడ్యూల్ లో శ్రీలీల కూడా జాయిన్…

TFN Adminవాట్సాప్
ram charan game changer movie climax wrapped up
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్

డైరెక్టర్ శంకర్ మాత్రం బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నాయి. ప్రస్తుతం తను కమల్ తో ఇండియన్ 2 అలానే రామ్ చరణ్ తో ఆర్సీ 15 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈరెండు సినిమాల షూటింగ్ లను పార్లల్ గా చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు తానే ఈరెండు సినిమాల షూటింగ్ లకు సంబంధించి అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఆమధ్య ఇండియన్ 2 తైవాన్ షెడ్యూల్ ను పూర్తి చేసి గేమ్ ఛేంజర్ మూవీ క్లైమాక్స్ షూట్ కు వెళుతున్నట్టు అప్ డేట్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా గేమ్ ఛేంజర్ షూట్ కు సంబంధించి సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు శంకర్. తన ట్విట్టర్ ద్వారా గేమ్ ఛేంజర్ ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్‌ షూట్ మొత్తం…

TFN Adminవాట్సాప్
National Award winning actor arjun rampal on board for NBK 108 movie
సినిమా వార్తలు

NBK 108 లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు నటసింహాం బాలకృష్ణ. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు బాలయ్య అభిమానులు. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు అనిల్ రావిపూడి ఇంతవరకూ సక్సెస్ లే కొట్టాడు.. దీంతో ఈసినిమాతో బాలకృష్ణ కు హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టే అనిల్ కూడా బాలకృష్ణ కోసం సాలిడ్ కథను తయారుచేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
director vv vinayak about chatrapathi movie
సినిమా వార్తలు

ఛత్రపతి తో శ్రీనివాస్ హిందీలో పెద్ద స్టార్ అవుతాడు- వినాయక్

డైనమిక్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘ఛత్రపతి’ తో బాలీవుడ్‌లో గ్రాండ్ డెబ్యూ చేస్తున్నాడు. రాజమౌళి బ్లాక్‌బస్టర్ ఛత్రపతికి రీమేక్ గా అదే టైటిల్ తో ఈ చిత్రాన్ని గ్రాండ్ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. సినిమా ఈ నెల 12న విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
RRR movie creating records in japan
సినిమా వార్తలు

జపాన్ లో చరిత్ర సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి. చరిత్రలో అసలు కలవని ఇద్దరు స్వతంత్య్ర సమరయోధుల కథలను తీసుకొని ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని ఫైనల్ గా అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డును సైతం దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

TFN Adminవాట్సాప్
vijay deverakonda 13th movie shooting update
షూటింగ్ అప్‌డేట్

VD13 త్వరలో షూటింగ్ మొదలు

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస పరాజయాలు అందుకుంటున్నా తనకున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. వరుస అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్న ఈసినిమాను ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
abhiram daggubatis ahimsa movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

అహింస రిలీజ్ డేట్ ఫిక్స్

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తున్న మరో సినిమా అభిరామ్. తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తనయుడు.. రానా తమ్ముడు అభిరామ్ అవ్వడంతో తన ఎంట్రీ పై అందరికీ ఆసక్తి ఉంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస. ఇక‌ ఇప్ప‌టికే విడుద‌లైన అభిరామ్ ప్రీ లుక్ పోస్ట‌ర్ దగ్గర నుండి టీజర్ వరకూ వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను అయితే చేస్తున్నారు కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకూ చెప్పలేదు. తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ను జూన్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
pushpa 2 movie resumes the shoot
షూటింగ్ అప్‌డేట్

పుష్ప 2 షూటింగ్ మళ్లీ షురూ

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈసినిమాకు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈమధ్య షూట్ కు బ్రేక్ పడింది. గత కొద్దిరోజులు గా మైత్రీమూవీ మేకర్స్ ఆఫీసుల్లో ఐటీ దాడులు నిర్వహించడంతో షూట్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ షూటింగ్ సందడి మొదలైంది. ప్రస్తుతం మారేడుమిల్లి…

TFN Adminవాట్సాప్
shiva nirvana kushi movie first single na roja nuvve song out now
సాంగ్

ఖుషి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే సాంగ్ రిలీజ్

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం.. దానికి తోడు సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శివ నిర్వాణ ఎక్పర్ట్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాను గత ఏడాదే స్టార్ట్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగిఉంటే ఇప్పటికే రిలీజ్ అయిపోయి ఉండేది. కానీ షూటింగ్ మధ్యలో అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి. సమంత వేరే సినిమాలతో బిజీ ఉండటం అనంతరం హెల్డ్ ఇష్యూష్ రావడం.. విజయ్ కూడా వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూట్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఈసినిమాను…

TFN Adminవాట్సాప్
balagam movie won two awards in swedish international film festival 2023
సినిమా వార్తలు

బలగం కు స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్

ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు సందడి చేస్తాయి. కొన్ని హిట్ అయితే కొన్ని ఫట్ అయితే. అయితే కొన్ని సినిమాలు మాత్రమే మనసులను హత్తుకునేలా ఉంటాయి. ధియేటర్ బయటకు వచ్చిన తరువాత కూాడా ఆ భావోద్వేగాలు వెంటాడుతుంటాయి. అలాంటి జాబితాలోకే చేరుతుంది ఈమధ్య కాలంలో వచ్చిన బలగం సినిమా. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని కథ, సన్నివేశాలు, పాత్ర సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండటంతో చాలా మందికి కనెక్ట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మేకర్స్ కు పదింతలు లాభాలు చేకూర్చింది.

TFN Adminవాట్సాప్
adipurush movie trailer release time fixed
ట్రైలర్ & టీజర్

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. రాామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. దీనిలో భాగంగానే ప్రభాస్ పోస్టర్లు అలానే హనుమాన్ ఇంకా సీత పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ranbir kapoor shocking comments on bollywood
సినిమా వార్తలు

బాలీవుడ్ లో లోపంపై రణబీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్ రేంజ్ ఎక్కువగా ఉండేది.. ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మిగిలిన ఇండస్ట్రీలు వచ్చేవి. కానీ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. చాలాా గ్యాప్ తరువాత షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది అంతే.. అంతకుముందు అన్నీ వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ స్థాయి బాగా పడిపోయింది. మరోవైపు సౌత్ సినిమా స్థాయి మాత్రం పెరిగిపోతుంది. యంగ్ టాలెంట్, డిఫరెంట్ కథలు, జోనర్స్ తో సౌత్ మాత్రం తమ మార్కెట్ స్థాయిని అంతర్జాతీయంగా పెంచేసుకుంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ కి ఈపరిస్థితి రావడంపై ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలే పలు వ్యాఖ్యాలు చేశారు.

TFN Adminవాట్సాప్
virupaksha movie closer to 100 cr club
సినిమా వార్తలు

100 కోట్ల దిశగా విరూపాక్ష

సాయి ధరమ్ తేజ్ కు విరూపాక్షతో సినిమా మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు. రిపబ్లిక్ సినిమా తరువాత ఈసినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైమ్ పట్టింది. ఈసినిమా అనుకున్నప్పుడే సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. ఆ తరువాత కోలుకొని షూటింగ్ లో పాల్గొనడానికే చాలా టైమ్ పట్టింది. ఫైనల్ గా ఈసినిమాను కంప్లీట్ చేసి ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే విరూపాక్ష పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
ponniyin selvan 2 movie 10 days collections
బాక్సాఫీస్

పొన్నియన్ సెల్వన్ 2 జాక్ పాట్ కలెక్షన్స్

క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజ్ ఎట్టకేలకు రెండు పార్ట్ లుగా రూపుదిద్దుకొని.. రెండు పార్ట్ లు కూడా రిలీజ్ అయిపోయాయి. ఫస్ట్ పార్ట్ గత ఏడాది రిలీజ్ అయిపోయింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఒక్కటే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. అందులోనూ ఒక్క తమిళ్ లోనే చాలా వరకూ షేర్ వచ్చింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. చోళుల చరిత్ర నేపథ్యంలో తమిళ్ లో మంచి ప్రాముఖ్యం చెందిన పొన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందించడంతో వారికి దగ్గర కథ కావడంతో వారిని బాగా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్