సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన టీజర్ రిలీజ్

sundeep kishans ooru peru bhairavakona teaser released

సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ కాస్త డిఫరెంట్ గా ఉండే కథలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇక ఈఏడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. అయితే ఈసినిమా మంచి విజయాాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను గత ఏడాది సందీప్ కిషన్ పుట్టినరోజు నాడు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ను బట్టి ఈసినిమా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ సినిమా మొత్తం గరుడపురాణం చుట్టూ తిరుగుతుందని టీజర్ ని బట్టి అర్థమవుతుంది. శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణానికి, ఇప్పటి గరుడపురాణానికి.. నాలుగు పేజీలు తగ్గాయి అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఆ నాలుగు పేజీలే భైరవకోనగా ఏర్పడుతుంది. అసలు ఆ మాయమైన పేజీల్లో ఏం ఉన్నాయి? భైరవకొన కు వాటికి సంబంధం ఏంటి? అనే అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. శేఖర్‌ చంద్ర బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ తో పాటు టెక్నికల్ వాల్యూస్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అంతేకాదు సందీప్ కు హిట్ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

కాగా సూప‌ర్ న్యాచురల్ ఫాంటసీ జోన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =