టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు స్పై గా వచ్చేస్తున్నాడు నిఖిల్. గారీ బి.హెచ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో ప్రారంభించారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేపనిలో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా పలు పోస్టర్లను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది. ఈసినిమా రిలీజ్ డేట్ ప్లస్ టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమాను జూన్ 29వ తేదీన రిలీజ్ చేస్తుండగా.. టీజర్ ను మే 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా బ్యాక్ డ్రాప్ ను తెలియచేస్తూ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
There you gooooo🔥🔥🔥😍😍😍
June 29th it is !
See you all in the theatres near you 😍
.@actor_Nikhil @tej_uppalapati @Garrybh88 @anerudhp @AbhinavGomatam pic.twitter.com/BCZ0mySEKq— ISWARYA MENON 🌸 (@Ishmenon) May 6, 2023
కంట్రీ బెస్ట్ సీక్రెట్ ఏమిటి? తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అనే నినాదం ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ గురించి. సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలా దాగి ఉన్న కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని అనిపిస్తుంది వీడియోను బట్టి.
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: