మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇక గత ఏడాది ఎఫ్ 3, గని సినిమాతో ప్రేక్షకులతో ముందుకు రాగా.. వాటిలో ఎఫ్ 3 సినిమా హిట్ అయింది కానీ గని సినిమా మాత్రం పరాజయాన్ని అందించింది. ప్రస్తుతం అయితే వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. దీనితో పాటు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం మరో పీరియాడిక్ డ్రామాలో వరుణ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. పలాసా 1978 డైరెక్టర్ కరుణ కుమార్ వరుణ్ తేజ్ కు ఒక కథను చెప్పగా అది వరుణ్ తేజ్ కు నచ్చిందట. పీరియాడిక్ డ్రామాగా ఈసినిమా ఉండబోతుందని.. ఈసినిమా కోసం వరుణ్ తేజ్ కూడా తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకోవాల్సి ఉందట. 1950-1970 మధ్య కాలంలో జరిగే కథగా ఈసినిమా ఉంటుందట. స్క్రిప్ట్ చాలా ఇంటెన్స్ గా ఉండబోతుందట. ప్రస్తుతం అయితే ఈవార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: