నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. సైన్స్ ఫిక్స్ నేపథ్యంలో భారీ స్థాయిలో ఈసినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేశాయి. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్సే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ప్రోగెస్ ఏంటో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయిందని.. మిగిలిన 30శాతం షూటింగ్ మరో రెండు మూడు నెలల్లో రిలీజ్ అవుతుందని.. ఆతరువాత ఆరు నెలలు విఎఫ్ఎక్స్ పనులు జరుపనున్నారుట. ప్రమోషనల్ ప్లాన్స్ ను త్వరలో తెలియచేయనుట్టు తెలుస్తుంది.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.
మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























