NBK 108 కోసం పవర్ ఫుల్ ఇంటర్వెల్ సీక్వెన్స్

Powerful Interval Sequence for NBK 108 movie

ఈఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. NBK 108 అనే టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమానుండి పలు పోస్టర్లను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా కోసం పవర్ ఫుల్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి. బాలకృష్ణ మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని మరీ కథ రాస్తున్నప్పుడే పవర్ ఫుల్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ను రాసుకున్నాడట. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ బాలకృష్ణ ఇంకా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలల మధ్య ఉంటుందట. అంతేకాదు ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈసినిమా షూట్ ఆగష్ట్ వరకూ పూర్తి చేసి చెప్పిన డేట్ కే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =