సూపర్ట్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం రజనీ జైలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమాను ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాతో పాటు లాల్ సలామ్ అనే సినిమాలో కూడా రజనీ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక రజనీకాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా నుండి రజనీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో రజనీ మొయిదీన్ భాయ్ గా నటించనున్నాడు. అంతేకాదు పోస్టర్ లో మత ఘర్షణలు కూడా కనిపిస్తున్నాయి.
Everyone’s favourite BHAI is back in Mumbai 📍 Make way for #Thalaivar 😎 SuperStar 🌟 #Rajinikanth as #MoideenBhai in #LalSalaam 🫡
இன்று முதல் #மொய்தீன்பாய் ஆட்டம் ஆரம்பம்…! 💥
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl
🎥… pic.twitter.com/OE3iP4rezK— Lyca Productions (@LycaProductions) May 7, 2023
ఇంకా ఈసినిమాలో జీవిత రాజశేఖర్, రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తుంది. చాలా కాలం తరువాత జీవిత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: