ఇండస్ట్రీలో కొన్ని కొన్ని బ్యానర్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆ బ్యాన్ర్స నుండి సినిమాలు వస్తున్నాయి అంటే ఆసినిమాలపై ఆటోమేటిక్ గా అంచనాలు ఏర్పడతాయి. ఈసినిమాపై నమ్మకం ఏర్పడుతుంది. అలాంటి ప్రొడక్షన్ సంస్థే వైజయంతి మూవీస్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ కూడా ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ఎప్పటినుండో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది ఈసంస్థ. ఎంతో మంది హీరోలకు ఎన్నో హిట్ సినిమాలను అందించి వారి జాతకాలనే మార్చేసింది ఎంతో మంది హీరోలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయే చిత్రాలు నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ కూతురు కూడా స్వప్న దత్ కూడా స్వప్న సినిమాస్ పై పలు సినిమాలు నిర్మిస్తుంది. ఈ బ్యానర్ కూడా చాలా తక్కువ టైమ్ లోనే మంచి పేరును తెచ్చుకుంది. మొదటినుండీ మంచి హిట్ సినిమాలనే అందించింది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతారమం..ఇలా స్వప్న సినిమా నుండి వచ్చిన ప్రతి సినిమా క్లాసిక్ గా నిలిచింది. ఎంతో మంది నటులకు మంచి బ్రేక్ ఇచ్చింది.
విజయ దేవరకొండకు తొలి బ్రేక్ ఇచ్చింది స్వప్న సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. నానికి కూడా ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద బ్రేక్. అప్పటి వరకూ పైసా, ఆహా నా కళ్యాణం, జెండాపై కపిరాజు లాంటి ఫ్లాఫ్స్ తో ఇబ్బంది పడుతున్న నానికి ఎవడే సుబ్రహ్మణ్యం విజయం కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ సినిమా తర్వాతే నానికి భలే భలే మగాడివో, కృష్ణ గాడి వీర ప్రేమగాధ,మజ్ను, నేను లోకల్.. ఇలా డబుల్ హ్యాట్రిక్ విజయాలు వచ్చాయి.
ఇప్పుడు ఇదే బ్యానర్ నుండి ఇప్పుడు యంగ్ హీరో సంతోష్ శోభన్ చేసిన అన్ని మంచి శకునములే సినిమా వస్తుంది. దీంతో సంతోష్ శోభన్ కూడా మంచి నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటివరకూ సంతోష్ శోభన్ కు సాలిడ్ హిట్ పడింది లేదు. స్వప్న సినిమాస్ కు వచ్చిన పేరుతో అన్నీ మంచి శకునములేతో తనకు కూడా బ్రేక్ పడుతుందనే కాన్ఫిడెన్స్ సంతోష్ లో వుంది. మరి ఎన్నో ఐకానిక్ చిత్రాలు ఇచ్చి, ఎందరినో స్టార్స్ ని చేసిన వైజయంతి మూవీస్, స్వప్న సినిమా.. సంతోష్ శోభన్ కి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.
నందిని రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కగా.. ఈసినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, గౌతమి, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: