రామ్-బోయపాటి మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం

ram pothineni boyapati srinu movie dubbing works start

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ది ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, మాస్‌ ఎక్కువగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి రాపో20 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇంకా షూటింగ్ జరుపుకుంటున్నా మరోవైపు ఈసినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు స్టార్ట్ చేశారు. ఈ మేరకు డబ్బింగ్ స్టూడియో నుంచి దర్శకుడు బోయపాటి ఫోటోని మేకర్స్ రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈసినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =