ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

adipurush movie trailer release date announced

మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా ట్రైలర్ పై ప్రకటన వచ్చేసింది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ ఈ సినిమా తెరకెక్కింది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఫైనల్లీ జూన్ లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేయటానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లతో పాటు టీజర్ రిలీజ్ అయింది. టీజర్ కు కాస్త వ్యతిరేకత రావడంతో టైమ్ తీసుకొని ఇంకాస్త శ్రద్ద పెట్టారు. అందుకే చాలా కాలంగా ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ ఇవ్వలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చారు. నిజానికి ఈసినిమా ట్రైలర్ ఈనెల 9వ తేదీన రిలీజ్ అవుతున్నట్టు ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడ ఆవార్తలకు క్లారిటీ వచ్చేసింది. ఈసినిమా ట్రైలర్ ను మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + sixteen =